AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించిన బిజినెస్‌మెన్‌ భార్య, 11ఏళ్ల కొడుకు

జైన సమాజంలో చాలా మంది ప్రాపంచిక అనుబంధాలను, ఆనందాలను విడిచిపెట్టి మతం మార్గాన్ని అనుసరిస్తారు. దీక్ష తీసుకున్న తరువాత, వారు సన్యాసులుగా మారడం ద్వారా అన్ని రకాల భౌతిక సుఖాలను వదులుకుంటారు. కొన్ని రోజుల క్రితం, గుజరాత్‌లోని హిమ్మత్ నగర్ వ్యాపారవేత్త భవేష్ భండారీ, అతని భార్య సుమారు రెండు వందల కోట్ల విలువైన తమ ఆస్తిని విరాళంగా ఇచ్చేసి జైన సన్యాసాన్ని స్వీకరించారు.

కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించిన బిజినెస్‌మెన్‌ భార్య, 11ఏళ్ల కొడుకు
Jain Monks
Jyothi Gadda
|

Updated on: May 02, 2024 | 10:57 AM

Share

తల్లిదండ్రులు ఏం సంపాదించారని నిలదీస్తున్నారు చాలా మంది పిల్లలు. అలాగే, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు పంచిపెట్టలేదని కన్నవారినే చిత్రహింసలు పెడుతున్నారు మరికొందరు. ఆస్తుల కోసం అమ్మనాన్నలనే కనికరం లేకుండా చంపేస్తున్నారు ఇంకొందరు. కానీ, తండ్రి సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులు కాదనుకుని సన్యాసం పుచ్చుకున్నాడు ఓ కొడుకు. బెంగళూరులోని ఓ బడా బిజినెస్‌మేన్ కొడుకు తండ్రికున్న ఆస్తినంతా కాదనుకున్నాడు. జైన సాధువుగా మారిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్త భార్య, వారి 11 ఏళ్ల కుమారుడు గుజరాత్‌లోని సూరత్‌లో తమ భౌతిక జీవితాన్ని విడిచిపెట్టి జైన సన్యాసాన్ని స్వీకరించారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Prit Shah (@prit_shah_photography)

బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మనీశ్ భార్య మనీశ్‌ భార్య స్వీటీ (30), కుమారుడు హృధన్‌ జైన్‌ (11)లకు జైన గురువులు సన్యాస దీక్షను ఇచ్చారు. దీక్ష అనంతరం వారికి భావశుద్ధి రేఖాశ్రీ, హితాశయ్‌ రతన్‌ విజయ్‌గా గురువులు నామకరణం చేశారు. భవబంధాల నుంచి దూరంగా జైన మఠాల్లో ఉంటూ, తన కుమారునితో కలిసి సమాజ సేవ చేస్తామని భావశుద్ధి రేఖాశ్రీ వెల్లడించారు. 30 ఏళ్ల స్వీటీ తన 11 ఏళ్ల కొడుకుతో యాచకురాలిగా మారిన సందర్బానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సమాచారం ప్రకారం.. భావశుద్ధి రేఖాశ్రీ గర్భవతిగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డతో కలిసి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. అలాగే, తన కుమారుడు కూడా తన మార్గంలోనే నడవాలని భావించారు. జైన సమాజంలో చాలా మంది ప్రాపంచిక అనుబంధాలను, ఆనందాలను విడిచిపెట్టి మతం మార్గాన్ని అనుసరిస్తారు. దీక్ష తీసుకున్న తరువాత, వారు సన్యాసులుగా మారడం ద్వారా అన్ని రకాల భౌతిక సుఖాలను వదులుకుంటారు. కొన్ని రోజుల క్రితం, గుజరాత్‌లోని హిమ్మత్ నగర్ వ్యాపారవేత్త భవేష్ భండారీ, అతని భార్య సుమారు రెండు వందల కోట్ల విలువైన తమ ఆస్తిని విరాళంగా ఇచ్చేసి జైన సన్యాసాన్ని స్వీకరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..