Covishield Vaccine: కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! భయపడాల్సిన అవసరం లేదు: మాజీ శాస్త్రవేత్త రామన్‌

దీనిపై ఐసీఎంఆర్‌ మాజీ శాస్త్రవేత్తను ప్రశ్నించగా.. ఆయన ఖండించారు. ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అయితే అవి కాలక్రమేణా మాయమవుతాయని చెప్పారు. ఇప్పుడు భారత దేశం మొత్తం కరోనా నుండి సురక్షితంగా ఉందని, కొత్త వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

Covishield Vaccine: కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! భయపడాల్సిన అవసరం లేదు: మాజీ శాస్త్రవేత్త రామన్‌
Covishield
Follow us
Jyothi Gadda

|

Updated on: May 02, 2024 | 9:46 AM

కోవిషీల్డ్‌ను తయారు చేసి ఆస్ట్రాజెనెకా ప్రకటనతో భారతదేశంలో పెను దుమారం మొదలైంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారనే చర్చ సోషల్ మీడియాలో తీవ్రమైంది. అయితే కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ తీసుకున్న వారు పూర్తిగా సురక్షితంగా ఉన్నారని, భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతదేశం ప్రజలు తీసుకున్న కరోనా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్‌పై ఆందోళన చెందుతున్న క్రమంలో ICMR మాజీ శాస్త్రవేత్తలు ఓదార్పునిస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు చాలా అరుదుగా కనిపిస్తాయన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారు భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ICMR మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ రమాన్‌ గంగాఖేడ్కర్‌ స్పష్టం చేశారు.

కోవిషీల్డ్ టీకాను పొందిన 1 మిలియన్ (ప్రతి 10 లక్షల మందికి) మందిలో 7 నుండి 8 మందికి మాత్రమే గుండెపోటు, రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుందని చెప్పారు. అది కూడా మొదటి డోసు తీసుకొన్న సమయంలోనే ఉంటుందని రామన్ గంగాఖేద్కర్ చెప్పారు. తర్వాతి డోసుల సమయానికి ఆ రిస్క్‌ పూర్తిగా తగ్గుతుందని, ఏమైనా దుష్ప్రభావాలు చూపిస్తే, అది మొదటి 2 నుంచి 3 నెలల్లోనే జరుగుతుందని స్పష్టం చేశారు.

భారతదేశంలో దాదాపు 90 శాతం మంది ప్రజలు కోవిషీల్డ్‌తో టీకాలు వేశారు. కానీ దాని దుష్ప్రభావాలు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కనిపించాయి. అవి కూడా సాధారణ చికిత్సతో నయమయ్యాయి. రెండున్నరేళ్ల తర్వాత వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం లేదని, దీనిపై అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బ్రిటన్‌లో జరిగిన కేసుకు సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో.. భారత్‌లోనూ కొంత భయం నెలకొంది. దీనిపై ఐసీఎంఆర్‌ మాజీ శాస్త్రవేత్తను ప్రశ్నించగా.. ఆయన ఖండించారు. ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అయితే అవి కాలక్రమేణా మాయమవుతాయని చెప్పారు. ఇప్పుడు భారత దేశం మొత్తం కరోనా నుండి సురక్షితంగా ఉందని, కొత్త వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..