పచ్చి మిరపకాయలను రాత్రంతా నానపెట్టి.. ఆ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..? మ్యాజిక్‌లాంటి మార్పు..!

వీటితో త్వరగా బరువు తగ్గవచ్చు. మంచి గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా పచ్చిమిర్చి నీరు ఉపయోగపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల మీ చర్మం మెరుస్తుంది. ఈ హెల్తీ డ్రింక్ తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. మిరపకాయలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

పచ్చి మిరపకాయలను రాత్రంతా నానపెట్టి.. ఆ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..? మ్యాజిక్‌లాంటి మార్పు..!
Green Chilli Water
Follow us

|

Updated on: May 02, 2024 | 7:16 AM

ఆరోగ్యంగా ఉండటానికి లేదా ఫిట్‌గా ఉండటానికి ఎక్కువ మంది సహజమైన ఆహారాలు, మసాలా దినుసులను తీసుకుంటారు. మన వంటింట్లో సులభంగా లభించే అటువంటి మసాలాలలో ఒకటి పచ్చి మిరపకాయలు. పచ్చి మిర్చిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి మిరపకాయలతో తడ్కా, పప్పులు, అనేక ఇతర వంటకాలలో కూడా వాడుతుంటారు. ఇది కూరగాయల రుచిని పెంచుతుంది. మీరు పచ్చి మిర్చి చట్నీ తినడం వల్ల దాని పోషకాల ప్రయోజనాలను పొందుతారు.. అయితే, పచ్చి మిర్చి నీటిని కూడా తాగుతారని మీకు తెలుసా..? పచ్చిమిర్చి నానబెట్టిన నీరు తాగితే అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఈ నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

పచ్చి మిరపకాయలను నీళ్లలో నానబెట్టి తాగటం వల్ల ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు పచ్చిమిర్చిలో ఎక్కువగా ఉంటాయి. ఈ మూలకాలు మీ శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు, ఇతర వ్యాధుల నుండి సురక్షితంగా ఉంచుతాయి. పచ్చి మిరపకాయల్లో బీటా కెరోటిన్‌ కూడా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా మీరు వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవచ్చు.

పచ్చిమిర్చి నీటితో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. డయాబెటిక్ పేషంట్స్ వారి షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేయడానికి పచ్చి మిర్చి నీరు ఒక ఎఫెక్టివ్ రెమెడీ. పచ్చిమిర్చి నీరు తాగడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటుంది. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. జీర్ణశక్తికి కూడా మేలు చేస్తుంది. పచ్చి మిరపకాయల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. మిరపకాయలు తినడం, మిరపకాయ నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీ జీర్ణక్రియ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పచ్చి మిర్చి నీరు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది .

ఇవి కూడా చదవండి

పచ్చి మిర్చి నానబెట్టిన నీరు బరువు తగ్గడానికి అద్భుతమైన పానీయం. పచ్చి మిరపకాయ నీటిని తాగడం వల్ల కొవ్వును కాల్చే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇది జీర్ణ శక్తిని, జీవక్రియను పెంచుతుంది. వీటితో త్వరగా బరువు తగ్గవచ్చు. మంచి గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా పచ్చిమిర్చి నీరు ఉపయోగపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల మీ చర్మం మెరుస్తుంది. ఈ హెల్తీ డ్రింక్ తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. మిరపకాయలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

* పచ్చిమిర్చి నీటిని ఎలా తయారు చేసుకోవాలి?

– రాత్రి పడుకునే ముందు 3-4 పచ్చి మిరపకాయలను బాగా కడగాలి.

– ఇప్పుడు మిరపకాయ మధ్యలో ఒక చీలిక చేయండి.

– ఈ మిరపకాయలను 1 గ్లాసు నీటిలో నానబెట్టండి.

– ఉదయాన్నే ఈ నీటిని తాగండి.

– మీరు ఈ నీటిని తాగడానికి ముందు కొంత సమయం వరకు ఏమీ తినకూడదు, తాగకూడదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..