ద్యావుడా..! ప్లేట్ పానీపూరీ ఏకంగా రూ.333లా..? ఇకపై బంగారమే అవుతుందేమో అంటున్న నెటిజన్లు.. ఎక్కడంటే..
వెంటనే తన ఫోన్ తో దాని ఫోటో తీసి కౌశిక్ ముఖర్జీ అనే బిజినెస్‌మెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట తెగ వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ముంబై ఎయిర్‌పోర్టులో ఉండే ఫుడ్ స్టాల్స్‌లోని ఫుడ్ చాలా ఖరీదు అని తెలుసు కానీ.. మరీ అంత కాస్ట్ లీ అని తెలియదంటూ పోస్ట్‌కు క్యాప్షన్‌పై నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో తమ అభిప్రాయాలను తెలియజేశారు.
పానీపూరీ.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోరూరుతుంది. భారతదేశంలోని దాదాపు ప్రతి నగరంలో పానీపూరి స్టాల్స్ కస్టమర్లతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంటాయి. మన దేశంలో కెల్లా స్ట్రీట్ ఫుడ్ లలో ఎక్కువ మంది ఇష్టంగా తినేది ఏదైనా ఉందంటే అది పానీపూరీ అని టక్కున చెప్పేస్తారు. పైగా ఇది పెద్ద రెస్టారెంట్లు, విమానాశ్రయాలలో కూడా లభిస్తుంది. సాధారణంగా ఇవి షాపుల్లో ప్లేట్ రూ.20-30కి లభిస్తాయి. ఒక ప్లేట్‌లో 6-8 పానీపూరీలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ఎయిర్ పోర్ట్ లో అమ్మిన పానీపూరీ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది దాని రుచి గురించి కాదు, దాని ధర గురించి. అక్కడ ప్లేట్ పానీపూరీ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఇక్కడ ఒక ప్లేట్ పానీపూరీ తినాలంటే అక్షరాల 333రూపాయలు చెల్లించాల్సిందే.
ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం (సిఎస్‌ఐఎ)లో స్ట్రీట్ ఫుడ్ ధరలను హైలైట్ చేస్తూ సోషల్ మీడియా పోస్ట్ ఆహార ప్రియులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. పోస్ట్‌లో పానీ పూరీ, దహీ పూరీ, సెవ్ పూరీ వంటి ఫేమస్ స్నాక్స్ రేట్లను ప్రదర్శించారు. ఎనిమిది పూరీల పానీపూరీ ధర రూ. 333, సాధారణ ధరలు రూ. 25 నుండి రూ. 50 కంటే తక్కువే ఉంటుంది. కానీ, ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 333కి విక్రయింస్తున్న షాకింగ్ పోస్ట్ ఇంటర్‌నెట్ వేదికగా ఆన్‌లైన్ తుఫానుకు దారితీసింది.
Real estate is expensive for food stalls at the CSIA Mumbai airport – but I didn’t know THIS expensive 👀 pic.twitter.com/JRFMw3unLu
— Kaushik Mukherjee (@kaushikmkj) April 29, 2024
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’లో ఒక వినియోగదారుడు ముంబై ఎయిర్ పోర్టులో తన ఎదుర్కొన్న అనుభవాన్ని పంచుకున్నాడు. అక్కడ ఉన్న ఓ ఫుడ్ స్టాల్‌కు వెళ్లిన అతడు..ప్లేట్ పానీపూరీ ధర రూ.333 అని రాసి ఉండటం చూసి కళ్లు తేలేశాడు. ఓరీ దేవుడో ప్లేట్ పానీపూరీ ఇంత రేట్ ఏంటి అని ఆశ్చర్యపోయాడు. వెంటనే తన ఫోన్ తో దాని ఫోటో తీసి కౌశిక్ ముఖర్జీ అనే బిజినెస్‌మెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట తెగ వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ముంబై ఎయిర్‌పోర్టులో ఉండే ఫుడ్ స్టాల్స్‌లోని ఫుడ్ చాలా ఖరీదు అని తెలుసు కానీ.. మరీ అంత కాస్ట్ లీ అని తెలియదంటూ పోస్ట్‌కు క్యాప్షన్‌పై నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో తమ అభిప్రాయాలను తెలియజేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..