AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video : బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ టీఆర్పీ ఉన్న మెట్రో..! లొల్లి మళ్లీ మొదలైంది.. ఈ అక్క పంచాయతీ ఏంటంటే..

అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక అమ్మాయి ఫోన్‌లో మాట్లాడటం విన్న మహిళలు కోపంతో ఊగిపోయారు. అదే కోపంలో వారు ఏం చేశారో తెలిస్తే షాక్‌ అవుతారు. ఢిల్లీ మెట్రోలో ఒక అమ్మాయి, ఎదుటి మహిళ మధ్య వాగ్వాదం కనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు.

Watch Video : బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ టీఆర్పీ ఉన్న మెట్రో..! లొల్లి మళ్లీ మొదలైంది.. ఈ అక్క పంచాయతీ ఏంటంటే..
Delhi Metro
Jyothi Gadda
|

Updated on: May 01, 2024 | 9:31 AM

Share

మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని వీడియోల్లో ప్రయాణికులు కొట్లాడుకోవడం, మరికొన్ని వీడియోల్లో గొడవలు, ఇంకొన్ని సార్లు ప్రయాణికుల పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేయటం వంటివి అనేక చిత్ర విచిత్రాలు చేస్తు్న వీడియోలు చూశాం. ఇక ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలో గురించి అయితే, ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఢిల్లీ మెట్రో ఇప్పుడు బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌ కంటే కూడా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలకు ఎక్కువ టీఆర్పీ ఉంది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక అమ్మాయి ఫోన్‌లో మాట్లాడటం విన్న మహిళలు కోపంతో ఊగిపోయారు. అదే కోపంలో వారు ఏం చేశారో తెలిస్తే షాక్‌ అవుతారు. ఢిల్లీ మెట్రోలో ఒక అమ్మాయి, ఎదుటి మహిళ మధ్య వాగ్వాదం కనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు.

కదులుతున్న మెట్రోలో ఓ అమ్మాయి మహిళా ప్రయాణికులతో వాగ్వాదానికి దిగడం వీడియోలో చూడవచ్చు. అసలు విషయం ఏంటంటే.. ఆ అమ్మాయి ఫోన్‌లో గట్టిగా మాట్లాడుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీంతో అక్కడ కూర్చున్న కొందరు మహిళలు అభ్యంతరం తెలిపారు. ఆడపిల్లలు కాస్త సహనంగా ఉండాలని, శాంతంగా మాట్లాడమని చెప్పడంతో ఆ యువతి ఒక్కసారిగా కోపంతో రెచ్చిపోయి ఆమెపై అరవడం మొదలుపెట్టింది.

ఇవి కూడా చదవండి

అరుస్తున్న యువతి గొంతు విని చాలా మంది మహిళలు భరించలేక తలలు పట్టుకున్నారు. దాంతో ఆమె వారిపైనే ఆరోపణలకు దిగింది. మీరంతా కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించింది. అలా కాదని ఎందరు చెప్పినా ఆమె శాంతించలేదు. ఎవరి మాట లెక్కచేయకుండా ఆమె నోటికి వచ్చినట్టుగా అరుస్తూనే ఉంది. దీనికి సంబంధించిన వీడియోను ట్రైలో ఉన్న మరికొందరు ప్రయాణికులు తీయగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఈ వీడియో @gharkekalesh అనే ఖాతాతో ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియోను దాదాపు రెండు లక్షల మంది వీక్షించగా, వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన పలువురు కామెంట్‌ చేశారు. బిగ్ బాస్ కంటే ఢిల్లీ మెట్రోకే ఎక్కువ టీఆర్పీ వస్తోందని ఒకరు రాశారు. ఢిల్లీ మెట్రో ఫైట్ క్లబ్‌గా మారిందని మరొకరు రాశారు. ఇప్పటి వరకు నేను ఇవన్నీ చూడలేదని ఇలాంటి వ్యక్తులు ఏ లైన్‌లో కనిపిస్తారో చెప్పాలంటూ మరోకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..