Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటరు మహశయులకు బంపర్ ఆఫర్..! ఓటు వేసిన వారికి డైమండ్‌ రింగ్, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిడ్జ్, TV.. !

మీ విలువైన ఓటు వేయడం ద్వారా మీరు లక్కీ డ్రాలో విజేతగా మారవచ్చు. లక్కీ డ్రాలో పాల్గొనడం ద్వారా మీరు డైమండ్ రింగ్‌ని గెలుచుకునే అవకాశం ఉంది. ఓటు వేసిన తర్వాత సిరా మార్క్ చూపించిన వారికి డైమండ్ రింగ్, రిఫ్రిజిరేటర్, టీవీ, ఇతర బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుందని ఏకంగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఓటరు మహశయులకు బంపర్ ఆఫర్..! ఓటు వేసిన వారికి డైమండ్‌ రింగ్, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిడ్జ్, TV.. !
Diamond Rings
Follow us
Jyothi Gadda

|

Updated on: May 01, 2024 | 12:51 PM

రండి.. ఓటేయండి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు పట్టేయండి.. అంటున్నారు ఎన్నికల అధికారులు. ఓటింగ్‌ శాతాన్ని లక్కీ డ్రా ఆఫర్‌తో ముందుకు వచ్చారు. మీ వేలిపై సిరా మార్క్‌ పడితే.. డైమాండ్‌ రింగ్‌ని గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. ఓటింగ్ రోజున ఎన్నికల సంఘం మూడు లక్కీ డ్రాలను నిర్వహిస్తుంది. ఓటులో పాల్గొన్న ప్రజలకు డైమండ్ రింగ్ ఒక్కటే కాకుండా ఇతర బహుమతులు కూడా అందజేయనున్నారు. టీవీలు, ఫ్రిజ్‌లు, స్కూటర్లు, బైక్‌లు కూడా బహుమతులుగా ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటించారు. ఇదంతా ఎక్కడో కాదండోయ్‌ మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఓటింగ్‌ను పెంచడానికి, పరిపాలన ఈ మేరకు నజరానాతో ఓటర్లను పోలింగ్‌ వైపుకు మళ్లించేలా చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో రెండు దశల ఓటింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘానికి ఆందోళన పెరిగింది. ఓటర్లను ఓటు వేసేలా చేసేందుకు కమిషన్ ఇప్పుడు లక్కీ డ్రాను ప్రకటించింది. మీ విలువైన ఓటు వేయడం ద్వారా మీరు లక్కీ డ్రాలో విజేతగా మారవచ్చు. లక్కీ డ్రాలో పాల్గొనడం ద్వారా మీరు డైమండ్ రింగ్‌ని గెలుచుకునే అవకాశం ఉంది. పోలింగ్ రోజున భోపాల్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం ప్రతి రెండు గంటలకు ఒక లక్కీ డ్రాను ప్రకటించింది. ఓటు వేసిన తర్వాత సిరా మార్క్ చూపించిన వారికి డైమండ్ రింగ్, రిఫ్రిజిరేటర్, టీవీ, ఇతర బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుందని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మూడో దశలో మే 7న భోపాల్‌లో పోలింగ్‌ జరగనుంది. వాస్తవానికి, ఈసారి మధ్యప్రదేశ్‌లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది, మొదటి రెండు దశల్లో సగటున 8.5శాతం కంటే ఎక్కువ తగ్గుదల నమోదైంది. భోపాల్ నివాసితులు ఎన్నడూ ఉత్సాహభరితమైన ఓటర్లు కాదు. 2019లో ఇతర చోట్ల పోలింగ్ శాతం పెరగగా, భోపాల్‌లో పోలింగ్ శాతం 65.7శాతం మాత్రమే నమోదైంది. ఈ మేరకు ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.