Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యబాబోయ్.! నీటిలో కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. అటుగా పడవ తిప్పిచూస్తే..

భూమిపైనా, నీటిలోనూ మనకు తెలియని.. మనిషి కూడా కనిపెట్టలేని అనేక వింతలూ, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చే ఆ జీవులు.. మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అసలు ఇలాంటివి కూడా ఇంకా ఉన్నాయా.! అని మనం నిర్ఘాంతపోతుంటాం. సరిగ్గా ఇలాంటి వీడియోనే..

అయ్యబాబోయ్.! నీటిలో కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. అటుగా పడవ తిప్పిచూస్తే..
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: May 01, 2024 | 1:25 PM

భూమిపైనా, నీటిలోనూ మనకు తెలియని.. మనిషి కూడా కనిపెట్టలేని అనేక వింతలూ, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చే ఆ జీవులు.. మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అసలు ఇలాంటివి కూడా ఇంకా ఉన్నాయా.! అని మనం నిర్ఘాంతపోతుంటాం. సరిగ్గా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు దగ్గరలోని ఓ నదిలో పడవ వేసుకుని వెళ్లిన ఓ జాలరికి.. షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇంతకీ ఆ జాలరి అక్కడ ఏం చూశాడు.? చివరికి ఏం జరిగింది.? ఈ స్టోరీలో చూసేద్దాం.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. నదిలో ఓ జాలరి పడవపై వెళ్తుండగా ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. తన పడవకు అతి సమీపాన ఓ వింత జీవి ఈదుతున్నట్టు కనిపించింది. అది ఏంటా అని దగ్గరకు వెళ్లి చూడగా.. అదొక స్పైడర్ కోతి అని అర్ధమవుతుంది. నీటిలో నుంచి ఒక్క ఉదుటున బోటుపైకి ఎక్కిన కోతి.. ఆ తర్వాత బోటు ముందు వైపునకు వెళ్లి కూర్చుంటుంది. ఆ కోతి ఒడ్డుకు వెళ్లే ఉద్దేశ్యంతో అది బోటు ఎక్కినట్టు అనిపిస్తుంది. సరిగ్గా ఒడ్డుకు చేరుకోగానే.. అది బోటు నుంచి దూకేసి.. అడవిలోకి వెళ్లిపోతుంది. ఈ స్పైడర్ కోతులు దక్షిణ అమెరికాతో పాటు మెక్సికో నుంచి బ్రెజిల్ వరకు ఉన్న అడవుల్లో కనిపిస్తుంటాయి. కాగా, ఈ స్పైడర్ కోతులు పండ్లు, ఆకులు, పూలు, కీటకాలను తిని బ్రతుకుతుంటాయి. తేమ ఎక్కువగా ఉన్న అడవుల్లో ఇవి నివాసముంటాయి. ఇవి అంతరించిపోతున్న జాతుల్లో ఉండగా.. ఈ వీడియోకు ప్రస్తుతం ట్విట్టర్‌లో లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.