AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊరుబాట పట్టిన విద్యార్థులు.. ఏకంగా వాటి కోసం ఉద్యమాన్నే ఎత్తుకున్నారు.. ఎందుకంటే..?

ఊర పిచ్చుకలు ఇప్పుడు కనిపించడం లేదుగానీ.. ఊళ్లల్లో చిన్నప్పుడు ఇళ్లల్లోనూ కీచ్ కీచుమంటూ సందడి చేసేవి. కానీ, ఇప్పుడా పిచ్చుకలు ఎక్కడో గానీ కనిపించడం లేదు. అసలు పిచ్చుకలు కట్టే గూళ్లు చూసినప్పుడు వాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికీ అబ్బురపడేవాళ్లం. అలాంటి గూళ్ల జాడే లేకుండా పోయింది. అదిగో ఇదే అస్సాంలో గోలాఘాట్ విద్యార్థులను బాధించింది. అందుకోసం మరి వాళ్లేం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ఊరుబాట పట్టిన విద్యార్థులు.. ఏకంగా వాటి కోసం ఉద్యమాన్నే ఎత్తుకున్నారు.. ఎందుకంటే..?
Chola High School Students For Urban Birds
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 19, 2026 | 8:41 PM

Share

ఊర పిచ్చుకలు ఇప్పుడు కనిపించడం లేదుగానీ.. ఊళ్లల్లో చిన్నప్పుడు ఇళ్లల్లోనూ కీచ్ కీచుమంటూ సందడి చేసేవి. కానీ, ఇప్పుడా పిచ్చుకలు ఎక్కడో గానీ కనిపించడం లేదు. అసలు పిచ్చుకలు కట్టే గూళ్లు చూసినప్పుడు వాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికీ అబ్బురపడేవాళ్లం. అలాంటి గూళ్ల జాడే లేకుండా పోయింది. అదిగో ఇదే అస్సాంలో గోలాఘాట్ విద్యార్థులను బాధించింది. అందుకోసం మరి వాళ్లేం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

అభివృద్ధి, విలాసాల పేరిట అడవుల్లేకుండా పోయి, కనీసం చెట్లు కూడా కానరాకుండా పోయాయి.. పల్లెలు కూడా కాంక్రీట్ జంగల్స్‌గా మారుతున్నాయి. పైగా మోబైల్ టవర్స్, విస్తరిస్తున్న పారిశ్రామిక కాలుష్యం, గ్రానైట్ పేరిట అంతరించిపోతున్న కొండలతో సహజసిద్ధమైన ప్రకృతిని మనిషి విధ్వంసం చేస్తున్నాడు. దాంతో పశుపక్ష్యాదుల ఉనికే నేటి రోజుల్లో ప్రశ్నార్థకంగా మారిపోతోంది. అదే గోలాఘాట్ విద్యార్థులను కదిలించింది. వారందిరినీ ఐకమత్యంగా ఓ సమూహంగా మార్చగలిగింది. ఇప్పుడు అందుకే పిచ్చుక గూళ్లు నిర్మించడం నుంచి పిచ్చుకలను కాపాడుకునేందుకు సమాజంలో వారు అవగాహన కల్పిస్తున్నారు. పట్టణాల్లోనూ పక్షులు బతుకగలిగేందుకు వాటికోసం సురక్షిత స్థలాలను వారు సృష్టిస్తున్నారు.

అస్సాం రాష్ట్రం గోలాఘాట్ జిల్లాలో ఉదయం మొదటి సూర్య కిరణాలతో.. పట్టణాలు మేలుకుంటాయి. కానీ, అక్కడి సాధారణ జనం కదలికల కంటే కూడా మనల్ని కొందరి సంకల్పం ఆకర్షిస్తుంది. బోంగావ్ అనే గ్రామంలో చోలా హైస్కూల్ కు చెందిన 500 మందికి పైగా విద్యార్థులు చిన్న మొక్కలతో పాటు.. మట్టితో చేసిన గూళ్లను నిర్మిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నారు. నగరీకరణ వల్ల ప్రమాదంలో పడుతున్న పక్షులను, ముఖ్యంగా ఊర పిచ్చుకలను రక్షించడమే వారి కర్తవ్యం.

2025లో బర్డ్ నెస్ట్ కన్జర్వేషన్ డే ప్రారంభమైంది. చెట్ల స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరుగుతున్నకొద్దీ.. అనేక పక్షులకు గూళ్లు కట్టుకునే సురక్షిత ప్రాంతాలు కరువయ్యాయి. ఇదే విషయాన్ని బోంగావ్ చోలా హైస్కూల్ అక్కడి టీచర్స్.. వారి విద్యార్థుల్లో కదలిక తీసుకొచ్చేలా బోధించారు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు పక్షులను కాపాడే ఒక ఉద్యమానికి ఒక 500 మంది విద్యార్థుల బృందం నడుం బిగించింది. ఇప్పటికైనా అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని ఆపలేకపోయినా.. ప్రకృతిని కాపాడే దిశలో పక్షుల ప్రాణాలనైనా రక్షించాలన్న సంకల్పంతో విద్యార్థుల బృందం రంగంలోకి దిగింది. లేకపోతే ఉదయాన్నే మధుర స్వరాలనందించే ఆ పక్షులు మెల్లిగా మాయవ్వడం ఖాయమని భావించారు అక్కడి విద్యార్థులు.

మొదట మట్టితో తయారుచేసిన కొన్ని గూళ్లను తీసుకెళ్లి చెట్లపై, ఇళ్ల పైకప్పులపై అమర్చారు. వారనకున్నట్టే కొద్దిరోజుల తర్వాత చాలా గూళ్లల్లో పక్షులు గుడ్లు పెట్టాయి. అవి పక్షులకు రక్షిత స్థలాలుగా మారాయని, వారు చేసిన ప్రయోగం విజయవంతమైందనిపించింది. దాంతో ఆ మిషన్ ను మరింత విస్తరించాలనుకున్నారు. స్థానిక పక్షులు తినే పండ్లకు సంబంధించిన చెట్లను కూడా నాటుతూ, ఆ చెట్ల కొమ్మలు పక్షులకు ఆశ్రయం మాత్రమే కాదు, ఆహారాన్నీ అందించేలా ప్లాన్ చేశారు. అనుకున్నట్టే అలాంటి చెట్లను విస్తారంగా నాటుతున్నారు. విద్యార్థుల ప్రతీ చర్యలో కూడా మానవ అభివృద్ధి, ప్రకృతి మధ్య సమతుల్యత గోచరించేలా చోలా హైస్కూల్ విద్యార్థుల స్ఫూర్తి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

మట్టితో తయారుచేసిన గూళ్లను ఇళ్లు, చెట్లు, పొదలు వంటి చోట్ల ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం వరకే విద్యార్థుల బృందం పరిమితం కాలేదు. ప్రకృతిని కాపాడటం.. మానవాభివృద్ధి, ప్రకృతి సమతుల్యత ఎంత అవసరమో వాటిని నృత్యనాటికల ద్వారా చూపిస్తూ ప్రచారం చేయడం, అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా సమాజాన్నీ భాగస్వామ్యం చేస్తున్నారు. తమ రోజువారీ జీవితానికి ప్రకృతి ఎంత అవసరమో మర్చిపోతున్న సమాజం గుర్తెరిగేలా చేస్తున్నారు. చోలా హైస్కూల్ విద్యార్థుల స్ఫూర్తి ఇప్పుడు మరింత దూరం విస్తరించింది. చినాటోలీ వంటి మరిన్ని ప్రాంతాలకూ పాకింది. అక్కడి పాఠశాలలతో పాటు.. మజులి వంటి నదీ ద్వీపాల్లో కూడా ఇప్పుడు పక్షులు, ప్రకృతి సంరక్షణ పట్ల శ్రద్ధ పెరిగింది. సంరక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి.

అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం జరుగుతున్న రోజుల్లో.. చదువుకున్నవారు కూడా విలాసాలు, డబ్బు మోహంలో తామేం చేస్తున్నామో కన్నూమిన్నూ గానని రీతిలో వ్యవహరిస్తున్న క్రమంలో.. ఒక 500 మంది విద్యార్థుల బృందం చేపట్టిన ప్రకృతి సంరక్షణ యజ్ఞం.. మనుషులు, సాటి ప్రాణులు, ప్రకృతి, పక్షుల పట్ల ఎలా వ్యవహరించాలో చెప్పేది.

అస్సాంలో ఉదయించే సూరీడు మధ్యాహ్నం నిప్పుల వర్షం కురిపించినా కాపాడేలా ఆ విద్యార్థుల బృందం పెంచుతున్న మొక్కలు అక్కడి సమాజానికి చల్లని నీడను పంచుతున్నాయి. ఎక్కడో ఇళ్లపైన, చెట్లపైన ఏర్పాటు చేసే మట్టి గూళ్లల్లోకి పక్షులు చేరుకుంటున్నాయి. రుతువులు మారుతున్నా.. గోలాఘాట్ సంరక్షకులైన ఆ విద్యార్థులు గూడు గూడు నిర్మిస్తూ పర్యావరణ పరిరక్షణలోనూ, పక్షుల సంరక్షణలోనూ ఓ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వాటి కోసం ఉద్యమాన్నే ఎత్తుకున్న విద్యార్థులు..!
వాటి కోసం ఉద్యమాన్నే ఎత్తుకున్న విద్యార్థులు..!
చామంతి హెర్బల్ టీ తాగితే.. ఎంతో ఉల్లాసం మరెంతో ఉత్సాంహం మీ సొంతం!
చామంతి హెర్బల్ టీ తాగితే.. ఎంతో ఉల్లాసం మరెంతో ఉత్సాంహం మీ సొంతం!
లగ్నపత్రిక షేర్ చేసిన బిగ్‌బాస్ పునర్నవి.. వరుడు ఎవరో తెలుసా?
లగ్నపత్రిక షేర్ చేసిన బిగ్‌బాస్ పునర్నవి.. వరుడు ఎవరో తెలుసా?
అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే
అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే
ఎర్ర కోక.. నెత్తిన పూలు.. అబ్బో ఈ బ్యూటిని చూస్తే మతి పోవాల్సిందే
ఎర్ర కోక.. నెత్తిన పూలు.. అబ్బో ఈ బ్యూటిని చూస్తే మతి పోవాల్సిందే
పెళ్లిలో మిగిలిపోయిన ఆహారాన్ని ఎత్తిన యుపీఎస్‌సీ అభ్యర్థి..!
పెళ్లిలో మిగిలిపోయిన ఆహారాన్ని ఎత్తిన యుపీఎస్‌సీ అభ్యర్థి..!
కోచ్‌తో పాక్ కెప్టెన్ వాగ్వాదం.. కోపంతో ఏం చేశాడో తెలుసా?
కోచ్‌తో పాక్ కెప్టెన్ వాగ్వాదం.. కోపంతో ఏం చేశాడో తెలుసా?
పసపు రంగు మిరపకాయలు చూశారా.. వీటి ధర తెలిస్తే నోరెళ్లబెడతారు
పసపు రంగు మిరపకాయలు చూశారా.. వీటి ధర తెలిస్తే నోరెళ్లబెడతారు
ఇక రాత్రంతా తెరిచి ఉండనున్న దుకాణాలు...!
ఇక రాత్రంతా తెరిచి ఉండనున్న దుకాణాలు...!
IT రిటర్న్స్‌ ఆలస్యంగా వచ్చినా దానిపై వడ్డీ రాలేదా?
IT రిటర్న్స్‌ ఆలస్యంగా వచ్చినా దానిపై వడ్డీ రాలేదా?