AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch viral video: మా మంచి మాస్టారు..! పిల్లల్ని బడికి రప్పించేందుకు భలే ప్లాన్‌ చేశాడు.. దెబ్బకు వర్షంలా వచ్చిన విద్యార్థులు..

పిల్లలు స్కూల్‌ పట్ల ఆకర్షితులయ్యేలా ఏం చేద్దామా అని అందరం కూర్చుని ఆలోచించగా ఈ ఐడియా తట్టినట్టుగా స్కూల్ ప్రిన్సిపాల్ వైభవ్‌ సింగ్‌ చెప్పారు. ఇక ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు పాజిటివ్ గా స్పందించారు. ఈ పిల్లలు తమ జీవితాంతం ఈ రోజులను గుర్తుంచుకుంటారని ఒకరు రాశారు. ఎందుకంటే అందరికీ ఇలాంటివి పొందలేరని అన్నారు.

Watch viral video: మా మంచి మాస్టారు..! పిల్లల్ని బడికి రప్పించేందుకు భలే ప్లాన్‌ చేశాడు.. దెబ్బకు వర్షంలా వచ్చిన విద్యార్థులు..
school classroom turn in pool
Jyothi Gadda
|

Updated on: May 01, 2024 | 12:13 PM

Share

దేశంలోని అనేక రాష్ట్రాలు ఎండతీవ్రత, వేడిగాలుల కారణంగా ఇబ్బంది పడుతున్నాయి. అధిక వేడి, ఉక్కపోత కారణంగా ఉదయం, సాయంత్రం తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం మానుకుంటున్నారు. అదే సమయంలో కొన్ని చోట్ల విద్యార్థులు కూడా పాఠశాలలకు రావడం మానేశారు. విద్యార్థులను స్కూల్‌కి రప్పించేందుకు గానూ కన్నౌజ్‌లో అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు స్కూల్‌ సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ వీడియో కన్నౌజ్‌లోని ఉమ్ర్దా బ్లాక్‌లోని మహసౌనాపూర్ ప్రాంతంలోని మోడల్ ప్రైమరీ స్కూల్‌కి చెందినది. ఎండాకాలం కావడంతో ఎక్కువ ఎండ, వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్కూల్‌కు రావడం మానేశారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో స్కూల్‌ ప్రిన్సిపాల్ ఒక సరికొత్త ఆలోచన చేశారు. పరిమిత వనరులతో పిల్లల కోసం పాఠశాల ప్రాంగణంలోనే ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. పాఠశాలలోని తరగతి గదిని నీటితో నింపి, అందులో పిల్లలను సరదాగా గడిపేందుకు అనుమతించారు. దీంతో స్కూల్‌కి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ వైభవ్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

పిల్లలు స్కూల్‌ పట్ల ఆకర్షితులయ్యేలా ఏం చేద్దామా అని అందరం కూర్చుని ఆలోచించగా ఈ ఐడియా తట్టినట్టుగా స్కూల్ ప్రిన్సిపాల్ వైభవ్‌ సింగ్‌ చెప్పారు. స్మిమ్మింగ్‌ పూల్‌ నిర్మాణంతో విద్యార్థులను ఈజీగా బడికి రప్పించవచ్చుననే ఆలోచనతో ఇదంతా చేశామని చెప్పారు. దీంతో పిల్లలు వేడి నుంచి కూడా ఉపశమనం పొందుతున్నారు. పాఠశాలకు ఆకర్షితులవుతారు. ఇప్పుడు పిల్లల సంఖ్య పెరగడంతో మా ప్లాన్ వర్కవుట్ అయినట్లే అన్నారు.

క్లాస్‌రూమ్‌లో నిర్మించిన స్విమ్మింగ్ పూల్‌లో చిన్నారులు స్నానాలు చేస్తూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. వీడియో చూసిన తర్వాత, ఒక సోషల్ మీడియా వినియోగదారు, పిల్లలు భలే సరదాగా ఎంజాయ్‌ చేస్తున్నారని రాశారు. ఈ పిల్లలు తమ జీవితాంతం ఈ రోజులను గుర్తుంచుకుంటారని ఒకరు రాశారు. ఎందుకంటే అందరికీ ఇలాంటివి పొందలేరని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల