AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్తగారితో అల్లుడి ఎఫైర్.. రెడ్ హ్యాండ్‌గా పట్టుబడడంతో గ్రామస్తులంతా పెళ్లి

తన భార్య తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో అల్లుడు. ఈ వేడుకకి మావ, గ్రామస్తులు సాక్షిగా నిలిచారు. నివేదికల ప్రకారం 55 ఏళ్ల దిలేశ్వర్ దర్వే భార్య గీతా దేవి (45).. తన అల్లుడు సికందర్ యాదవ్‌తో అక్రమ సంబంధం కలిగి ఉంది. ఇటీవల వారిద్దరూ ఏకాంతంలో ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా కుటుంబ సభ్యులకు పట్టుబడ్డారు. వీళ్ల ప్రేమకథ ఊరంతా వార్తగా మారడంతో గ్రామస్థులంతా కలసి అల్లుడుకి అత్తగారికి పెళ్లి చేశారు.

అత్తగారితో అల్లుడి ఎఫైర్.. రెడ్ హ్యాండ్‌గా పట్టుబడడంతో గ్రామస్తులంతా పెళ్లి
Bihar Man Marries Mother In Law
Follow us
Surya Kala

|

Updated on: May 01, 2024 | 12:25 PM

రోజు రోజుకీ బంధాలు అనుబంధాలకు మధ్య అర్ధం మారుతోంది. భార్యాభర్తల మధ్య బంధం బీటలు వారుతోంది. వివాహేతర సంబంధాలకు దారితీస్తుంది. తాజాగా తల్లిగా చూసుకోవాల్సిన అత్తగారితో అక్రమ సంబంధం పెట్టుకున్న అల్లుడికి గ్రామస్తులందరూ కలిసి పెళ్లి చేశారు. ఈ ఘటన బీహార్‌లోని బంకాలో చోటు చేసుకుంది. తన భార్య తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో అల్లుడు. ఈ వేడుకకి మావ, గ్రామస్తులు సాక్షిగా నిలిచారు. నివేదికల ప్రకారం 55 ఏళ్ల దిలేశ్వర్ దర్వే భార్య గీతా దేవి (45).. తన అల్లుడు సికందర్ యాదవ్‌తో అక్రమ సంబంధం కలిగి ఉంది. ఇటీవల వారిద్దరూ ఏకాంతంలో ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా కుటుంబ సభ్యులకు పట్టుబడ్డారు. వీళ్ల ప్రేమకథ ఊరంతా వార్తగా మారడంతో గ్రామస్థులంతా కలసి అల్లుడుకి అత్తగారికి పెళ్లి చేశారు.

భార్యను కోల్పోయిన సికందర్ యాదవ్ కొన్ని నెలలుగా అత్తగారి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ సమయంలో అత్తగారికి, అల్లుడికి మధ్య సన్నిహితం బాగా పెరిగింది. అప్పుడు గీత దేవి భర్తకు తన భార్య, అల్లుడి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. విచారణలో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం బయటపడింది. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని.. దిలేశ్వర్ పంచాయతీకి సమాచారం అందించారు. అప్పుడు పంచాయితీ పెద్దలు, గ్రామస్తుల ముందు తన అత్తగారిపై తనకున్న ప్రేమను బహిరంగంగా ప్రకటించాడు అల్లుడు సికందర్ యాదవ్. తదనంతరం దిలేశ్వర్, గ్రామస్తుల అంగీకారంతో, సికందర్ అత్తగారైన గీతాదేవిని వివాహం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి:

ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఏప్రిల్ 28న @HalchalPriya అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ఇప్పుడు ఈ వీడియో ప్రతిచోటా వైరల్‌గా మారింది. అలాగే నెటిజన్లు కూడా విభిన్నంగా వ్యాఖ్యానించడం గమనించవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..