AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లంటే ఆట, పాట, విందు భోజనాల కోసం చేసే తంతు కాదు.. రిజిస్ట్రేషన్‌కు ఇవి తప్పనిసరన్న సుప్రీం కోర్టు

"హిందూ వివాహం ఒక సంస్కారమైన మతకర్మ. ఇది భారతీయ సమాజంలో గొప్ప విలువ కలిగిన సంస్థగా దాని హోదాను పొందవలసి ఉంటుంది. అందువల్ల యువతీ యువకులు వివాహ వ్యవస్థలోకి ప్రవేశించే ముందు కూడా దాని గురించి లోతుగా ఆలోచించాలని మేము కోరుతున్నాము. భారతీయ సమాజంలో వివాహం అనేది 'పాటలు , డ్యాన్స్, విందు కోసం లేదా కట్నాలు, కానుకలను డిమాండ్ చేసే ఒక సందర్భం కాదని ధర్మాసనం వెల్లడించింది. 

పెళ్లంటే ఆట, పాట, విందు భోజనాల కోసం చేసే తంతు కాదు.. రిజిస్ట్రేషన్‌కు ఇవి తప్పనిసరన్న సుప్రీం కోర్టు
Hindu Marriage
Surya Kala
|

Updated on: May 01, 2024 | 12:07 PM

Share

హిందూ వివాహ సాంప్రదాయంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహం  పవిత్ర లక్షణాలను ప్రస్తావిస్తూ.. అది ఒక పవిత్రమైన మతపరమైన పక్రియ అని పేర్కొంది. అంతేకాదు హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే వివాహ క్రతువు సముచితమైన మర్యాదలతో నిర్వహించాలని కోర్టు నొక్కి చెప్పింది. సప్తపది (పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడు మెట్లు) వంటి వేడుకలను గురించి ప్రస్తావించింది. జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం హిందూ వివాహం మతకర్మ అని, “ఆట పాట”, “విందు భోజనాల” కోసం జరిగే కార్యక్రమం కాదని పేర్కొంది.

“హిందూ వివాహం ఒక సంస్కారమైన మతకర్మ. ఇది భారతీయ సమాజంలో గొప్ప విలువ కలిగిన సంస్థగా దాని హోదాను పొందవలసి ఉంటుంది. అందువల్ల యువతీ యువకులు వివాహ వ్యవస్థలోకి ప్రవేశించే ముందు కూడా దాని గురించి లోతుగా ఆలోచించాలని మేము కోరుతున్నాము. భారతీయ సమాజంలో వివాహం అనేది ‘పాటలు , డ్యాన్స్, విందు కోసం లేదా కట్నాలు, కానుకలను డిమాండ్ చేసే ఒక సందర్భం కాదని ధర్మాసనం వెల్లడించింది.

పెళ్లి అంటే వ్యాపారం కాదు

“వివాహం అనేది వాణిజ్యపరమైన లావాదేవీ కాదు. ఇది ఒక గంభీరమైన కుటుంబ వ్యవస్థకు పునాది కార్యక్రమం. భవిష్యత్తులో అభివృద్ధి చెందుబోతున్న కుటుంబానికి భార్యాభర్తల హోదాను పొందే స్త్రీ,  పురుషుల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది.

ఇవి కూడా చదవండి

హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హిందూ వివాహాన్ని నమోదు చేయడం వల్ల వివాహానికి రుజువు లభిస్తుందని..  అయితే చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం వివాహానికి చట్టబద్ధత లభించదని జస్టిస్‌లు బివి నాగరత్న, అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇది చెల్లుబాటు అయ్యే హిందూ వివాహ వేడుక కోసం ఆవశ్యకాలను నిర్దేశిస్తుంది.

“సెక్షన్ 7 ప్రకారం వివాహం జరగకపోతే రిజిస్ట్రేషన్ వివాహానికి చట్టబద్ధత ఇవ్వదు. ఈ నిబంధన ప్రకారం హిందూ వివాహాల నమోదు కేవలం హిందూ వివాహ రుజువును సులభతరం చేయడానికి మాత్రమే అని పేర్కొన్నారు.

వివాహం చెల్లుబాటు అయ్యే హిందువుకు అవసరమైన షరతులను పాటించినప్పటికీ, పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా పార్టీల మధ్య వివాహ వేడుక జరగాలి. కనుక చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఇది హిందూ వివాహం అయి ఉండాలని చెప్పారు. చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం వివాహం చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం “హిందూ వివాహం” లేకున్నా అటువంటి వివాహాన్ని ఘనంగా నిర్వహించిన్నా ఆ పెళ్లికి చట్టం దృష్టిలో హిందూ వివాహ గుర్తింపు లభించదు. పరస్పర గౌరవం, భార్యాభర్తల మధ్య బంధం హిందూ వివాహం పవిత్ర లక్షణం అని కూడా సుప్రీం కోర్టు నొక్కిచెప్పింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..