Delhi Bomb Threat: 60 ప్రముఖ పాఠశాలకు బాంబు బెదిరింపు కాల్స్.. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని ఢిల్లీ

బాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు 50కి పైగా పాఠశాలలకు ఈ-మెయిల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. బెదిరింపుల నేపథ్యంలో విద్యార్థులను ఇంటికి పంపించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఆయా స్కూళ్లకు చేరుకుని పిల్లలను తీసుకెళ్లారు. ఆపై పాఠశాలల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.

Delhi Bomb Threat: 60 ప్రముఖ పాఠశాలకు బాంబు బెదిరింపు కాల్స్.. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని ఢిల్లీ
Bomb Squads
Follow us

|

Updated on: May 01, 2024 | 12:10 PM

బాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు 50కి పైగా పాఠశాలలకు ఈ-మెయిల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. బెదిరింపుల నేపథ్యంలో విద్యార్థులను ఇంటికి పంపించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఆయా స్కూళ్లకు చేరుకుని పిల్లలను తీసుకెళ్లారు. ఆపై పాఠశాలల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.

షాలిమార్ గార్డెన్‌లో ఉన్న ఢిల్లీ కాన్వెంట్ స్కూల్‌కు ఈ-మెయిల్ వచ్చింది. ఈ మెయిల్ ఉదయం 7.00 గంటలకు వచ్చింది, దీనిని పాఠశాల యాజమాన్యం ఇప్పుడు చూసి 112కి కాల్ చేసింది. పోలీసులు స్కూల్‌లో సోదాలు చేసినా బాంబు లభ్యం కాలేదు. స్కూల్ యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అటు ఢిల్లీలోని ఫైర్‌ స్టేషన్‌ 60కిపైగా కాల్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్కూళ్లకు బాంబు బెదిరింపుల వెనుక ఒకే వ్యక్తి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని కనుక్కొనేందుకు పోలీసులు సెర్చింగ్ మొదలు పెట్టారు. ఢిల్లీ డీసీపీ అపూర్వ గుప్తా మాట్లాడుతూ.. ఉదయం నుంచి చాలా స్కూళ్లకు ఈమెయిల్స్ వచ్చాయి.. స్కూళ్లను ఖాళీ చేస్తున్నారు.. ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది.. మాకు తెలిసినంత వరకు ఈ మెయిల్స్‌లోని కంటెంట్ అంతా అలాగే ఉంది అని పేర్కొన్నారు.

దీనిపై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి స్పందించారు. సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఏలాంటి బాంబును గుర్తించలేదు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు, స్కూల్ యాజమానులతో నిరంతరం టచ్‌లో ఉన్నామన్నారు. అవసరమైన చోట పాఠశాల అధికారులు తల్లిదండ్రులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భయపడాల్సిన పనిలేదన్నారు.

బాంబు బెదిరింపు కారణంగా ఢిల్లీలోని వివిధ పాఠశాలల్లో జరగాల్సిన పరీక్షలు నిలిచిపోయాయి. మరోవైపు బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెయిల్ పంపిన అగంతకుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈమెయిల్ పంపడానికి ఉపయోగించిన ఐపీ అడ్రస్ సర్వర్ విదేశాల్లో ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. నోయిడా-ఘజియాబాద్-ఢిల్లీ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. అదే ఐపీ అడ్రస్‌తో ఈమెయిల్ పంపినట్లు అనుమానిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు