AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గాలని అల్పాహారం మానేస్తున్నారా? అయితే మీరు రోగాలను కొనితెచ్చుకుంటున్నట్టే

బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారికి ప్రస్తుతం వినిపిస్తున్న ఏకైక మంత్రం 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' . సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు. అయితే, కేవలం గంటల లెక్కన ఉపవాసం ఉంటే సరిపోతుందని చాలామంది భావిస్తుంటారు.

బరువు తగ్గాలని అల్పాహారం మానేస్తున్నారా? అయితే మీరు రోగాలను కొనితెచ్చుకుంటున్నట్టే
Intermittent Fasting.jpg
Nikhil
|

Updated on: Feb 19, 2026 | 9:09 PM

Share

ఇందులో మనం చేస్తున్న ఒక చిన్న పొరపాటు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ మానేసి రాత్రి ఆలస్యంగా తినే అలవాటు ఉంటే జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు నిపుణులు. నేటి కాలంలో ఫిట్‌నెస్ పట్ల అవగాహన పెరిగింది. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే నిర్ణీత సమయం మాత్రమే ఆహారం తీసుకుంటూ, మిగిలిన గంటలన్నీ ఉపవాసం ఉండే పద్ధతి ప్రాచుర్యం పొందింది. సాధారణంగా 16 గంటల ఉపవాసం, 8 గంటల భోజన సమయం పాటిస్తుంటారు. అయితే, ఈ క్రమంలో ఏ సమయంలో తింటున్నామనేది అత్యంత కీలకం. ఈ విషయంలో ప్రజలు చేస్తున్న పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం..

జీవ గడియారం..

మన శరీరానికి ఒక అంతర్గత గడియారం ఉంటుంది. పగలు పని చేయడానికి, రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి మన అవయవాలు అలవాటు పడి ఉంటాయి. పగటిపూట ఇన్సులిన్ పనితీరు చాలా చురుగ్గా ఉంటుంది. రాత్రి అయ్యేకొద్దీ అది తగ్గుతుంది. శరీరం తనను తాను మరమ్మత్తు చేసుకునే సమయంలో మనం ఆహారం తీసుకుంటే, అది జీర్ణం కావడం కష్టమవుతుంది అంటున్నారు నిపుణులు. అంటే, మనం పగలు తినే ఆహారం శక్తిగా మారుతుంది, కానీ రాత్రి ఆలస్యంగా తినే ఆహారం కొవ్వుగా పేరుకుపోతుంది.

చాలామంది ఉదయం అల్పాహారం మానేసి, రాత్రిపూట భారీ భోజనం చేస్తున్నారు. ఇది మన శరీర జీవక్రియలకు వ్యతిరేకంగా పోరాడటమే అంటున్నారు నిపుణులు. ఉదయం 8 లేదా 10 గంటలకే ఆహారం తీసుకోవడం ప్రారంభించే ‘ఎర్లీ టైమ్ రిస్ట్రిక్టెడ్ ఈటింగ్’ పద్ధతి అత్యంత ప్రభావవంతమైనదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. చీకటి పడగానే మన మెదడులో ‘మెలటోనిన్’ అనే హార్మోన్ విడుదలవుతుంది.

ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించమని ప్యాంక్రియాస్‌కు సూచిస్తుంది. ఒకవేళ మీరు రాత్రి 9 గంటలకు భోజనం చేస్తే, ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాక రక్తంలో చక్కెర స్థాయిలు అలాగే ఉండిపోతాయి. దీనివల్ల భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు బ్రేక్‌ఫాస్ట్ మానేయడం కంటే రాత్రి భోజనాన్ని మానేయడం లేదా చాలా త్వరగా ముగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. సాయంత్రం 4 లేదా 6 గంటలకే భోజనం ముగించడం వల్ల, నిద్రపోయే సమయంలో శరీరం కణాల శుద్ధీకరణ ప్రక్రియను చేపడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గోల్డెన్ రూల్..

“ఉదయం రాజులా, మధ్యాహ్నం యువరాజులా, రాత్రిపూట పేదవాడిలా తినాలి” అనే సూత్రాన్ని పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. గడియారాన్ని చూడటం ఆపి, సూర్యుడి గమనాన్ని అనుసరించి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కేవలం ఎన్ని గంటలు ఆకలితో ఉన్నామనేది కాదు, ఎప్పుడు తింటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరూ సరైన సమయంలో ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

Follow Us
ఉదయం రాజులా.. రాత్రి పేదవాడిలా! 16:8 పద్ధతిలో రహస్యం ఇదే!
ఉదయం రాజులా.. రాత్రి పేదవాడిలా! 16:8 పద్ధతిలో రహస్యం ఇదే!
స్క్రీన్‌కు నెల రోజులు బ్రేక్.. లైఫ్ లో ఈ 2 రీసెట్ అవ్వడం ఖాయం!
స్క్రీన్‌కు నెల రోజులు బ్రేక్.. లైఫ్ లో ఈ 2 రీసెట్ అవ్వడం ఖాయం!
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కు ఇన్‌స్టాగ్రామ్ బిగ్ షాక్
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కు ఇన్‌స్టాగ్రామ్ బిగ్ షాక్
రాజమౌళి నా సినిమా నచ్చలేదు అని చెప్పారు
రాజమౌళి నా సినిమా నచ్చలేదు అని చెప్పారు
పాత కూలర్లతో ప్రమాదం.. ఇలా చేస్తే ఏసీని మించిన చల్లదనం
పాత కూలర్లతో ప్రమాదం.. ఇలా చేస్తే ఏసీని మించిన చల్లదనం
వీటిని తినే అలవాటు మీకూ ఉందా? అయితే మీ ప్రాణాలకు మీరే శత్రువులు
వీటిని తినే అలవాటు మీకూ ఉందా? అయితే మీ ప్రాణాలకు మీరే శత్రువులు
వాటి కోసం ఉద్యమాన్నే ఎత్తుకున్న విద్యార్థులు..!
వాటి కోసం ఉద్యమాన్నే ఎత్తుకున్న విద్యార్థులు..!
చామంతి హెర్బల్ టీ తాగితే.. ఎంతో ఉల్లాసం మరెంతో ఉత్సాంహం మీ సొంతం!
చామంతి హెర్బల్ టీ తాగితే.. ఎంతో ఉల్లాసం మరెంతో ఉత్సాంహం మీ సొంతం!
లగ్నపత్రిక షేర్ చేసిన బిగ్‌బాస్ పునర్నవి.. వరుడు ఎవరో తెలుసా?
లగ్నపత్రిక షేర్ చేసిన బిగ్‌బాస్ పునర్నవి.. వరుడు ఎవరో తెలుసా?
అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే
అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే