AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్య బాబోయ్‌.. ఆలీ కాదురా ఇది అనకొండ..! పెళ్లి మండపంలోనే రెచ్చిపోయిన వధువు ఏం చేసిందో చూస్తే వణుకే..

దాంతో చిర్రెత్తిపోయిన వధువు అతన్ని ఒక్క తోపు తోసింది.. కళ్యాణ మండపంలోనే వరుడిని చిత్తుచిత్తుగా కొడుతూ, కాళ్లతో తన్నుతూ నాన్‌స్టాప్‌గా తిట్ల దండకం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న బంధువులు, వధూవరుల తల్లిదండ్రులు ఇదంతా చూసి నివ్వెర పోయారు. ఆమెను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

అయ్య బాబోయ్‌.. ఆలీ కాదురా ఇది అనకొండ..! పెళ్లి మండపంలోనే రెచ్చిపోయిన వధువు ఏం చేసిందో చూస్తే వణుకే..
Bride Got Angry
Jyothi Gadda
|

Updated on: May 02, 2024 | 8:27 AM

Share

ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈరోజుల్లో ఏ ఫంక్షన్ అయినా ప్రత్యేక పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ప్రతి వేడుక దానికదే ప్రత్యేక థీమ్ ప్రకారం జరుగుతుంది. అందులోనూ పెళ్లి అంటే దాని ప్రిపరేషన్ కొంచెం ఎక్కువే. వధూవరుల వేషధారణ, వారి ప్రవేశం, మండపం అలంకరణకు ముందుగా ఎన్నో రకాల సన్నాహాలు జరుగుతున్నాయి. అలా పెళ్లిళ్లకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట విపరీతంగా సందడి చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఓ వీడియో వైరల్‌గా మారింది . ఆ పెళ్లి వీడియో వైరల్ కావడానికి కారణం పెళ్లి మండపంలో వధువు ప్రవర్తించిన తీరు. ఇక్కడ వధువు ప్రవర్తించిన తీరు నిజంగా చాలా విచిత్రంగా ఉంది.

సాధారణంగా ఆడ, మగ అనే తేడా లేకుండా పెళ్లి వేడుకలో వారి సొగసు, గాంభీర్యం, సిగ్గు, బిడియం వంటివి ఉంటాయి. కానీ ఇక్కడ అవేమీ లేవు. కళ్యాణ మండపంలోనే వధువు కాళికాదేవి రూపాన్ని ప్రదర్శించింది. అది కూడా చిన్న కారణానికే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నవ్వు ఆపుకోలేరు.

ఇవి కూడా చదవండి

అక్కడ ఏం జరిగింది?: పెళ్లి వేడుకలో వరుడు వధువుకు రసగుల్లా తినిపించడానికి ప్రయత్నించాడు. దానికి వధువు నో చెప్పింది. కానీ, వరుడు బలవంతంగా రసగుల్లాను ఆమె నోటిలో కుక్కుతాడు.. దాంతో చిర్రెత్తిపోయిన వధువు అతన్ని ఒక్క తోపు తోసింది.. కళ్యాణ మండపంలోనే వరుడిని చిత్తుచిత్తుగా కొడుతూ, కాళ్లతో తన్నుతూ నాన్‌స్టాప్‌గా తిట్ల దండకం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న బంధువులు, వధూవరుల తల్లిదండ్రులు ఇదంతా చూసి నివ్వెర పోయారు. ఆమెను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పాపం వరుడి పరిస్థితి ప్రాణాలతో బయటపడితే చాలు దేవుడా అన్నట్టుగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోకు నెటిజన్లు తీవ్రమైన రియాక్షన్స్‌ ఇస్తున్నారు. చాలా మంది స్మైలీ ఎమోజీలతో పోస్ట్‌ చేశారు. మరికొందరు పాపం.. అంటూ వరుడి పరిస్థితిపై జాలి పడుతున్నారు. మరోవైపు వధువు ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్