Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gomti Chakra: అనారోగ్యాలను దూరం చేసే లక్కీ స్టోన్.. సంపదను ఆకర్షించే గోమతీ చక్రం ప్రయోజనాలు తెలిస్తే..

గోమతీ చక్రాలను భక్తితో పూజించడం వల్ల గృహస్థులకు దీర్ఘాయుష్షు లభిస్తుంది. కేవలం ఆధ్యాత్మీక పరంగానే కాకుండా గోమతి చక్రంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. గోమతీ చక్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక నివారణలు, ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..

Gomti Chakra: అనారోగ్యాలను దూరం చేసే లక్కీ స్టోన్.. సంపదను ఆకర్షించే గోమతీ చక్రం ప్రయోజనాలు తెలిస్తే..
Gomti Chakra
Follow us
Jyothi Gadda

|

Updated on: May 02, 2024 | 7:46 AM

జ్యోతిషశాస్త్రంలో గోమతీ చక్రాన్ని ఎంతో ఉపయోగకరమైన రాయిగా అభివర్ణించారు. ఇది గోమతీ నదిలో కనిపించే ఒక ప్రత్యేకమైన పదార్థం. నత్తగుల్ల పెంకు లాగా కనిపించే ప్రత్యేకమైన రాయి గోమతి చక్రం. దీని రంగు తెలుపు, లేత పసుపు రంగులో ఉంటుంది. గోమతీ చక్రంలో ఒక భాగంలో సహజంగా గుండ్రని ఆకారం వంటి వృత్తం కనిపిస్తుంది. గోమతీ చక్రం శ్రీకృష్ణుని సుదర్శన చక్రం సూక్ష్మ స్వరూపమని నమ్ముతారు. ఈ రాయి ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుందని చెబుతారు. ఇది అన్ని సమస్యలను తొలగిస్తుంది. మీ జీవితంలో అన్ని రకాల అదృష్టాలకు తలుపులు తెరుస్తుందని విశ్వాసం. గోమతీ చక్రాలను భక్తితో పూజించడం వల్ల గృహస్థులకు దీర్ఘాయుష్షు లభిస్తుంది. కేవలం ఆధ్యాత్మీక పరంగానే కాకుండా గోమతి చక్రంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. గోమతీ చక్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక నివారణలు, ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..

గోమతీ చక్రం నుండి మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గోమతీ చక్రాన్ని బ్రాస్‌లెట్‌గా ధరించడం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఇతరులను సులభంగా ఆకర్షించగలడు. గోమతి చక్రాలను పొలంలో వేస్తే అధిక దిగుబడి వస్తుందని నమ్ముతారు. ఇంటి నిర్మాణ సమయంలో గోమతీ చక్రాలను భూమిలో పాతిపెట్టడం వల్ల ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. గోమతీ చక్రాల ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోమతీ చక్రాన్ని తాగే నీటిలో ఉంచడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. గోమతీ చక్రాన్ని లాకెట్‌గా ధరించడం వల్ల నరాల బలహీనత తగ్గుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. రెండు గోమతీ చక్రాలను అల్మారాలో లేదా డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో ఉంచితే సంపద పెరుగుతుంది. డబ్బు కొరత మిమ్మల్ని బాధించదు.

ఇవి కూడా చదవండి

గోమతీ చక్రాలను మంచం కింద లేదా దిండు కింద పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా అన్యోన్యంగా సాగిస్తుందని నమ్ముతున్నారు. గోమతీ చక్రాలను భక్తితో పూజించడం వల్ల ఆయురారోగ్యాలతో పాటు గృహస్తులకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..