Viral Video: చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! పిల్ల‌ల‌కు ఇలాంటివే నేర్పించాలంటూ..

ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా మంది స్పందించారు. ఇలాంటి విలువలను భవిష్యత్తు తరాలకు నేర్పించాల్సిన అవసరం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాల్యంలో మీరు మీ పిల్లలలో పెంచే సంస్కృతి వారిలో పెరుగుతుంది. వారు పెరిగేకొద్దీ దాని ప్రభావం వారి యవ్వనంలో కనిపిస్తుంది. అందుకే పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందించడంతోపాటు

Viral Video: చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! పిల్ల‌ల‌కు ఇలాంటివే నేర్పించాలంటూ..
Anand Mahindra Impressed By Little Girl's
Follow us
Jyothi Gadda

|

Updated on: May 02, 2024 | 8:58 AM

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ ఉంటారు. తాను చూసిన స్ఫూర్తి దాయకమైన వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెటిజన్లతో తన అభిప్రాయాలను పంచుకుంటారు. అంతే కాకుండా ప్రతిభ, సంస్కారం కలిగిన వారిని పోత్సహిస్తూ ఉంటారు. ముఖ్యంగా నేటి తరం ఇన్నోవేషన్స్, నెట్టింట వైరల్ అయ్యే హార్ట్ టచింగ్ విషయాలు, వీడియోలు, పోస్టుల ద్వారా పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో మరో ఆసక్తికర వీడియోను షేర్‌ చేశారు. ట్విట్టర్ లో పోస్టు చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన ఈ వీడియో విదేశాలకు చెందినదిగా తెలుస్తోంది. ఈ వీడియోలో వీల్‌చైర్‌లో ఒక వ్యక్తిని ఎక్కించుకుని రోడ్డు దాటుతున్న పసిబిడ్డ కనిపించింది. ఆ రోడ్డు వాహనాలతో రద్దీగా ఉంది. వీల్ చైర్ వాడే వ్యక్తిని ఆ చిన్నారి రోడ్డు దాటిస్తుండగా కార్లన్నీ ఆగిపోయాయి. రోడ్డు దాటుతున్నప్పుడు తమకు దారినిచ్చి ఆగిపోయిన వాహనదారులకు ఆ చిన్నారి వంగి వంగి కృతజ్ఞతలు చెప్పింది. ఆ పాపాయి వినయం, మర్యాదకు ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే. అందుకే, ఈ చిన్నారి ఆనంద్ మహీంద్రా హృదయాన్ని గెలుచుకుంది. చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా కూడా ఇంప్రెస్‌ అయ్యారు. దీంతో ఆయన ఆ వీడియోను ఎక్స్(ట్విట్టర్ ) లో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు. వీడియోను షేర్ చూస్తూ తన స్పందనను తెలియజేసారు. ప్రపంచం అంతా ఎందుకు ఇలా ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా మంది స్పందించారు. ఇలాంటి విలువలను భవిష్యత్తు తరాలకు నేర్పించాల్సిన అవసరం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాల్యంలో మీరు మీ పిల్లలలో పెంచే సంస్కృతి వారిలో పెరుగుతుంది. వారు పెరిగేకొద్దీ దాని ప్రభావం వారి యవ్వనంలో కనిపిస్తుంది. అందుకే పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందించడంతోపాటు తల్లిదండ్రులుగా మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. దీనికి మంచి ఉదాహరణ ఈ వీడియో అంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చిన్నారి చేసిన పనికి, విదేశాల్లోని ఈ ప్రత్యేక సంస్కృతిని రకరకాలుగా అభినందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..