Bihar: అత్తా.. ఐ లవ్ యూ.! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.!
బిహార్ లో విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. పిల్లనిచ్చిన అత్తను ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఊరందరి ముందు ఆమె నుదుట సిందూరం దిద్దాడు. ఆ తర్వాత రిజిస్ట్రార్ ఆఫీసులోనూ చట్టబద్ధంగా దంపతులయ్యారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. మామే దగ్గరుండి వివాహం జరిపించడం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బిహార్ లో విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. పిల్లనిచ్చిన అత్తను ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఊరందరి ముందు ఆమె నుదుట సిందూరం దిద్దాడు. ఆ తర్వాత రిజిస్ట్రార్ ఆఫీసులోనూ చట్టబద్ధంగా దంపతులయ్యారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. మామే దగ్గరుండి వివాహం జరిపించడం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానిక మీడియా కథనం ప్రకారం 45 ఏళ్ల సికందర్ యాదవ్ కు గతంలో పెళ్లయింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, అతని భార్య చనిపోవడంతో తన పిల్లలతోపాటుగా అత్తారింట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో 55 ఏళ్ల అత్త గీతా దేవితో అతనికి సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. అయితే వారు సన్నిహితంగా మెలుగుతుండటాన్ని గుర్తించిన సికందర్ మామ దిలీశ్వర్ దార్వేకు వారిపై అనుమానం కలిగింది. ఒకరోజు వారిద్దరి గుట్టు రట్టు చేశాడు. వెంటనే ఈ విషయంపై గ్రామ సర్పంచ్ సమక్షంలో పంచాయితీ కూడా పెట్టాడు. అయితే పెద్దలందరిముందూ మామకు అల్లుడు ఊహించని షాకిచ్చాడు. తాను అత్తను ప్రేమిస్తున్నానని, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో చేసేది లేక మామ కూడా అందుకు ఒప్పుకోవడంతో గ్రామస్తుల సమక్షంలో సికందర్ అత్త నుదుటిన సిందూరం దిద్దాడు. ఈ అసాధారణ సన్నివేశాన్ని గ్రామ ప్రజలంతా తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. కొత్త దంపతులకు తమ శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

