Elephant Yam: కంద దుంప లాభాల గురించి తెలిస్తే షాక్‌ అవుతారు..! వారంలో 2 సార్లు తింటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…

కంద తీసుకోవటం మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని పెంచుతుంది. కీళ్ల నొప్పులను నివారిస్తుంది. కందలో ఫైబర్ ఎక్కువ ఉండి, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు లేకుండా నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, సెలెనియం, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్… మెమరీ పవర్ పెంచుతాయి. మెదడు నరాలను చురుగ్గా ఉంచుతాయి.

Elephant Yam: కంద దుంప లాభాల గురించి తెలిస్తే షాక్‌ అవుతారు..! వారంలో 2 సార్లు తింటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…
Elephant Yam
Follow us
Jyothi Gadda

|

Updated on: May 04, 2024 | 8:36 AM

మార్కెట్‌లో అనేక రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రజలకు తెలియని కొన్ని కూరగాయలు ఉన్నాయి. వీటిలో ఒకటి కందదుంప. దీనినే యమ్ అని కూడా అంటారు. ఈ కూరగాయల ఆకారం ఏనుగు పాదంలా ఉంటుంది. అందుకే దీన్ని ఏనుగు పాదం అని కూడా అంటారు. ఇది డయాబెటిక్ రోగులకు దివ్యౌషధంగా చెబుతారు. మనలో చాలా మంది కందను తినటానికి ఇష్టపడరు. కానీ, కందలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనలో చాలామంది కంద దురదగా ఉంటుందని తినటానికి పెద్దగా ఇష్టపడరు. కానీ, కొన్ని దేశాల్లో ఈ కూరగాయలను ఎక్కువగా తింటారు. ఈ కూరగాయలో యాంటీ ఆక్సిడెంట్, బీటా కెరోటిన్ గుణాలు అధిక మొత్తంలో ఉంటాయి. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో తగిన మోతాదులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. విటమిన్ B6, విటమిన్ B1, రిబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ A, బీటా కెరోటిన్ కూడా ఈ కూరగాయలలో లభిస్తాయి.

కందలో ఉండే విటమిన్ ఎ చర్మానికి మేలు చేస్తుంది. అయితే ప్రతి 100 గ్రాముల కందలో దాదాపు 70 గ్రాముల నీరు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ చర్మం గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టయితే..మీ ఆహారంలో ఖచ్చితంగా కందను చేర్చుకోండి. ఇది రెగ్యూలర్‌ ఆహారంలో చేర్చుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. అలాగే ఫైబర్ సమృద్దిగా ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు. ఇది అధిక బరువు ఉన్నవారికి మంచి ప్రయోజనం కలిగిస్తుంది.

యామ్స్ రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడతాయి. శరీరంలో మంటను తగ్గించడంలో యామ్స్ సహాయం చేస్తుంది. యాంటి ఆక్సిడెంట్లు యాంటి క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటాయి. యామ్స్‌లో చాలా ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. యామ్స్ మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. యామ్స్‌లో ఫైబర్, పొటాషియం, మాంగనీస్, రాగి మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. యామ్స్ వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు వంటి రుతుక్రమం ఆగిన లక్షణాలకు సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

కంద తీసుకోవటం మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని పెంచుతుంది. కీళ్ల నొప్పులను నివారిస్తుంది. కందలో ఫైబర్ ఎక్కువ ఉండి, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు లేకుండా నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, సెలెనియం, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్… మెమరీ పవర్ పెంచుతాయి. మెదడు నరాలను చురుగ్గా ఉంచుతాయి.

బరువు తగ్గడానికి మీ ఆహారంలో కందను చేర్చుకోవచ్చు. కందలో ఉండే ఫ్లేవనాయిడ్‌లు వాటి స్థూలకాయ వ్యతిరేక లక్షణాల వల్ల బరువును వేగంగా తగ్గిస్తాయి. కంద తక్కువ కేలరీల కంటెంట్,అధిక ఫైబర్, కార్బోహైడ్రేట్ కంటెంట్ కలిగి ఉంటుంది. దీని వల్ల ఆకలి అనిపించదు. బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ