AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యం గురించి టెన్షన్ ఎందుకు దండగా.. ఈ హెల్దీ స్నాక్స్ ఉండగా.. ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలంటే..

ఆకలి వేసినా.. లేదా అకస్మాత్తుగా కొద్దిగా ఆకలిగా అనిపించినా.. మనం ఏదో ఒక ఆహారం తినాలనుకుంటాం.. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వర్క్ బిజీలో ఉన్నప్పుడు, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు.. కొద్దిగా ఆకలి అనిపించినప్పుడల్లా.. మనం స్నాక్స్ తినడానికి ఇష్టపడతాము. ఇవి సాంప్రదాయ భోజనాల నుంచి కొద్దిగా భిన్నంగా ఉంటాయి.

ఆరోగ్యం గురించి టెన్షన్ ఎందుకు దండగా.. ఈ హెల్దీ స్నాక్స్ ఉండగా.. ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలంటే..
Snacks
Shaik Madar Saheb
|

Updated on: May 04, 2024 | 11:22 AM

Share

ఆకలి వేసినా.. లేదా అకస్మాత్తుగా కొద్దిగా ఆకలిగా అనిపించినా.. మనం ఏదో ఒక ఆహారం తినాలనుకుంటాం.. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వర్క్ బిజీలో ఉన్నప్పుడు, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు.. కొద్దిగా ఆకలి అనిపించినప్పుడల్లా.. మనం స్నాక్స్ తినడానికి ఇష్టపడతాము. ఇవి సాంప్రదాయ భోజనాల నుంచి కొద్దిగా భిన్నంగా ఉంటాయి.. అయితే మంచి ఆరోగ్యానికి మనం తీసుకునే ఆహారాలు మంచిగా, ఆరోగ్యకరమైనవిగా ఉండటం చాలా ముఖ్యం.. ఇందులో అధిక కేలరీలు, సోడియం, అదనపు చక్కెర ఉంటే అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందుకే.. స్నాక్స్ లాంటి వాటిని మంచివి నాణ్యమైనవి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా మనం తిన్నప్పుడు అద్భుతమైన శక్తిని అందించే కొన్ని శాఖాహార స్నాక్స్ ను తీసుకోవాలి.. మీ రెగ్యులర్ డైట్‌లో కొన్నింటిని ఖచ్చితంగా చేర్చుకుంటే.. ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండేందుకు దోహదపడతాయి. అలాంటివాటిలో వెజ్ స్నాక్స్ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ 4 ఆరోగ్యకరమైన వెజ్ స్నాక్స్ తీసుకోండి..

కాల్చిన శనగలు: భారతదేశంలో కాల్చిన శనగలను ఇష్టపడని వారంటూ ఉండరు.. ఇవి మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కాల్చిన శనగలను తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలు కూడా బలపడతాయి.

గింజలు – విత్తనాలు: గింజలు, విత్తనాలను స్నాక్స్‌గా తీసుకుంటే అది మీకు శక్తి వనరుగా ఉపయోగపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి మీకు ఆకలిగా అనిపించినప్పుడల్లా వాటిని తినండి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

పాప్ కార్న్: ఆరోగ్యకరమైన స్నాక్స్ లో ఒకటి పాప్‌కార్న్.. మొక్కజొన్న పాప్ కార్న్‌ పోషకాలతో కూడిన చాలా ఆరోగ్యకరమైన చిరుతిండి. పసుపు వెన్నని ఈ వంటలో ఉపయోగించకపోవడమే మంచిది. ఎందుకంటే పసుపు వెన్నలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు..

మఖానా: చాలామంది మఖానాను తినడానికి ఇష్టపడుతుంటారు. దాని రుచి అందరినీ ఆకర్షిస్తుంది. దీనిని కార్బోహైడ్రేట్లు, ఐరన్, భాస్వరం, మెగ్నీషియం గొప్ప మూలంగా పరిగణిస్తారు. వీటిని ఉడికించడం సులభం.. దీని రుచిని పెంచడానికి ఉప్పును జోడించవచ్చు. దీనిని హెల్దీ స్నాక్స్ గా పరిగణిస్తారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..