AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గేందుకు అన్నం తినడం మానేస్తున్నారా..? అయితే మీరు కొత్త సమస్యలో చిక్కుకున్నట్లే..

ప్రస్తుత కాలంలో డైటింగ్ ట్రెండ్ నడుస్తోంది.. ఎందుకంటే.. చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారందరూ తమ బరువును తగ్గించేందుకు డైటింగ్ అంటూ ఆహారం తినడాన్ని మానేస్తున్నారు. అయితే, బరువు తగ్గేందుకు డైటింగ్ పట్ల ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉన్నా..

బరువు తగ్గేందుకు అన్నం తినడం మానేస్తున్నారా..? అయితే మీరు కొత్త సమస్యలో చిక్కుకున్నట్లే..
Weight Loss
Shaik Madar Saheb
|

Updated on: May 04, 2024 | 4:49 PM

Share

ప్రస్తుత కాలంలో డైటింగ్ ట్రెండ్ నడుస్తోంది.. ఎందుకంటే.. చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారందరూ తమ బరువును తగ్గించేందుకు డైటింగ్ అంటూ ఆహారం తినడాన్ని మానేస్తున్నారు. అయితే, బరువు తగ్గేందుకు డైటింగ్ పట్ల ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉన్నా.. సరైన సమాచారం, అవగాహన లేకపోవడంతో చాలాసార్లు డైటింగ్ పేరుతో ఆహార పదార్థాలకు దూరమవుతున్నారని.. దీంతో పలు సమస్యల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గే సమయంలోనే రాత్రి భోజనం మానేయడం గమనించవచ్చు. ఈ అలవాటు బరువును తగ్గించవచ్చు లేదా తగ్గించకపోవచ్చు.. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుందంటున్నారు. రాత్రి భోజనం మానేయడం వల్ల మీ శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా..? తెలియకపోతే.. ఇలాంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బరువు తగ్గాలనే తొందర వల్ల రాత్రి భోజనం మానేసే ధోరణి ప్రజల్లో కనిపిస్తోంది. బరువు తగ్గడానికి, ప్రజలు ఎవరి సలహానైనా పాటిస్తూ.. ఇటువంటివి చేయడం ప్రారంభిస్తారు.. కానీ ఇది వారి ఆరోగ్యంతో ఆడుకుంటుంది. మీరు నిరంతరం డిన్నర్‌ను స్కిప్ చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకోండి..

మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురికావచ్చు..

ఆహారం తీసుకోవడంలో రోజుకు మూడు ప్రధానమైన అంశాలున్నాయి. మొదటి భోజనం అల్పాహారం, రెండవ భోజనం మధ్యాహ్న భోజనం, మూడవ భోజనం రాత్రి భోజనం. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ భోజనాలలో దేనినైనా వదిలివేయడం ప్రారంభిస్తే, శరీరంలో పోషకాల కొరత కారణంగా, రోగనిరోధక శక్తి తగ్గడం ప్రారంభమవుతుంది. దాని కారణంగా మీరు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురవుతారు. కొన్నిసార్లు పోషకాల కొరత కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

బరువు తగ్గడానికి బదులు పెరగవచ్చు..

డిన్నర్‌ను దాటవేయడం వల్ల మీ నిద్ర తీరుకు భంగం కలుగుతుంది. దీని కారణంగా చిరాకు, విచారం వంటివి మీ మూడ్‌లో ప్రతికూల మార్పులు సంభవించవచ్చు. అంతేకాకుండా రాత్రిపూట సరైన నిద్ర పట్టకపోవడం వల్ల జీవక్రియ రేటు మందగిస్తుంది. రాత్రి భోజనం మానేయడం వల్ల మీరు కొంత సమయం వరకు బరువు తగ్గినట్లు అనిపించవచ్చు. కానీ అది మీ బరువు వేగంగా పెరగడానికి కారణమవుతుంది. ఇలా మీరు తీవ్రమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది.

బరువు తగ్గడానికి బదులుగా కండరాల నష్టం సంభవించవచ్చు..

మీరు క్రమం తప్పకుండా భోజనం మానేస్తే, మీ కండరాలు బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. వాస్తవానికి, మీరు ఆహారం తీసుకోనప్పుడు, మీ శరీరం శక్తి కోసం కండరాల కణజాలాలను ఉపయోగిస్తుంది. దీని కారణంగా మీరు బరువు తగ్గడానికి బదులుగా కండరాల నష్టానికి గురవుతారు. ఇది కాకుండా, నిరంతరంగా భోజనం మానేయడం వల్ల, మీ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గుతుంది..

బరువు తగ్గడానికి సరైన ప్రక్రియ ఏమిటి..?

బరువు తగ్గడానికి.. మీరు కేవలం డైటింగ్ ద్వారా లేదా వ్యాయామం చేయడం ద్వారా సరైన ఫలితాలను పొందలేరుజ కానీ ఈ రెండు విషయాలకు సంబంధించిన ఖచ్చితమైన కలయిక బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి, నిపుణుల నుంచి సరైన సమాచారం తీసుకోవాలి.. ఇది ప్రారంభించిన తర్వాత ఆహారం సమతుల్య పద్దతిలో లేదా డైటీషియన్లు సూచించిన దాని ప్రకారం తీసుకోవాలి.. అలాకాకుండా డైటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తే.. అనారోగ్యం బారిన పడక తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..