Peethala Pulusu: ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..

నాన్ వెజ్‌లో తీసుకునే వాటిల్లో పీతలు కూడా ఒకటి. పీతలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని చాలా తక్కువగా వండుకుంటారు. చాలా మందికి వండటం తెలియక తినడం మానేస్తున్నారు. కానీ పీతలు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పీతలతో వేపుడు చేసినా, ఇగురు చేసినా, పులుసు పెట్టినా చాలా రుచిగా ఉంటుంది. అయితే పీతల పులుసు తినేందుకే చాలా మంది..

Peethala Pulusu: ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
Peethala Pulusu
Follow us

|

Updated on: May 04, 2024 | 11:21 PM

నాన్ వెజ్‌లో తీసుకునే వాటిల్లో పీతలు కూడా ఒకటి. పీతలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని చాలా తక్కువగా వండుకుంటారు. చాలా మందికి వండటం తెలియక తినడం మానేస్తున్నారు. కానీ పీతలు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పీతలతో వేపుడు చేసినా, ఇగురు చేసినా, పులుసు పెట్టినా చాలా రుచిగా ఉంటుంది. అయితే పీతల పులుసు తినేందుకే చాలా మంది ఇష్ట పడుతూ ఉంటారు. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మరి ఈ పీతల పులుసును ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పీతల పులుసుకు కావాల్సిన పదార్థాలు:

పీతలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింత పండు, మెంతులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్.

పీతల పులుసు తయారీ విధానం:

ముందుగా పీతలను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ కళాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాక.. టమాటా ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించాలి. ఆ నెక్ట్స్ పీతలు వేసి ఓ ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసి రెండు నిమిషాలు వేయించాక.. చింతపండు పులుసు, నీళ్లు వేసి ఓ పదినిమిషాలు హై మంట మీద ఉడికించాలి. పులుసు దగ్గర పడ్డాక.. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కరివేపాకు వేసి కలపాలి. తర్వాత నీళ్లు పోసి.. మూత పెట్టి ఉడికించాలి. చివరగా అన్నీ ఒకసారి చూసుకుని కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే పీతల పులుసు సిద్ధం.

Latest Articles