AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Fruit Malai Kulfi: ఇంట్లో డ్రై ఫ్రూట్స్ మలాయ్ కుల్ఫీ తయారీ చేసుకోండి.. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు..

బయట దొరికే కుల్ఫీలను తినడం వలన ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల అనారోగ్యాలను తెచ్చుకున్నట్లే.. అయినప్పటికీ కుల్ఫీలను పెద్దలు పిల్లలు ఇష్టంగా తింటారు కనుక.. అనారోగ్యం అని తెలిసినా ఒకటి రెండు తింటే ఏమి కాదు అంటూ తినేస్తాం.. ఈ నేపథ్యంలో ఇంట్లోనే చాలా సింపుల్ గా మలాయ్ కుల్ఫీ ని తయారు చేసుకోవచ్చు. ఈ రోజు డ్రైఫ్రూట్స్ మలాయ్ కుల్ఫీ తయారీ విధానం ఏమిటో తెలుసుకుందాం.. 

Dry Fruit Malai Kulfi: ఇంట్లో డ్రై ఫ్రూట్స్ మలాయ్ కుల్ఫీ తయారీ చేసుకోండి.. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు..
Dry Fruit Malai Kulfi
Surya Kala
|

Updated on: May 04, 2024 | 10:28 AM

Share

వేసవి కాలం వచ్చిందంటే చాలు తాటి ముంజెలు, మామిడి పండ్లు, వంటి సీజనల్ పండ్లకు ఎంత డిమాండ్ ఉందో ఐస్ క్రీమ్స్, కుల్ఫీ వంటి వాటికి కూడా అంతే డిమాండ్ ఉంది. ముఖ్యంగా చల్లచల్లగా ఏదైనా తినాలి అనుకుంటే ఐస్ క్రీమ్ తో పాటు కూల్ డ్రింక్స్ కుల్ఫీ వంటివాటికి ప్రాధాన్యత ఇష్టం. అయితే బయట దొరికే కుల్ఫీలను తినడం వలన ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల అనారోగ్యాలను తెచ్చుకున్నట్లే.. అయినప్పటికీ కుల్ఫీలను పెద్దలు పిల్లలు ఇష్టంగా తింటారు కనుక.. అనారోగ్యం అని తెలిసినా ఒకటి రెండు తింటే ఏమి కాదు అంటూ తినేస్తాం.. ఈ నేపథ్యంలో ఇంట్లోనే చాలా సింపుల్ గా మలాయ్ కుల్ఫీ ని తయారు చేసుకోవచ్చు. ఈ రోజు డ్రైఫ్రూట్స్ మలాయ్ కుల్ఫీ తయారీ విధానం ఏమిటో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు :

  1. పాలు – క్రీమీ పాలు లీటరు
  2. నీరు – పావు కప్పు
  3. ఇవి కూడా చదవండి
  4. పంచదార – 4 టేబుల్ స్పూన్లు
  5. యాలకుల పొడి – కొంచెం
  6. డ్రై ఫ్రూట్స్ – ముక్కలు
  7. కుంకుమ పువ్వు -రెండు రేకలు
  8. కుల్ఫీ మౌల్డ్స్ లేదా చిన్న గ్లాసులు
  9. అల్యుమీనియం ఫాయిల్‌
  10. ఐస్ క్రీమ్ స్టిక్స్
  11. తయారీ విధానం: ముందుగా దళసరి గిన్నెను స్టవ్ మీద పెట్టి.. పావు కప్పు నీటిని పోయండి.
  12. అనంతరం తీసుకున్న పాలను ఆ నీటిలో వేసి బాగా కలిపి మరబెట్టుకోవాలి.
  13. ఇలా పాలను మరిగిస్తున్న సమయంలో మీగడ వస్తే తీసి మరొక గిన్నెలోకి వేసి.. పాలు చిక్కగా అయ్యే వరకూ మరగబెడుతూ అర లీటర్ అయ్యే వరకూ ఇలా చేయాలి.
  14. లీటరు పాలను మరిగించి అరలీటరు అయ్యి.. చాలా చిక్కగా పాలు వచ్చే వరకూ మరిగించి అందులో తీసుకున్న నాలుగు టేబుల్ టెన్నిస్ షుగర్ ను వేసి బాగా కలపాలి.
  15. ఇప్పుడు పాలు మరింత చిక్కబడి కొంచెం రంగు మారతాయి. ఇప్పుడు యాలకుల పొడి, కొంచెం కుంకుమ పువ్వుని వేసి బాగా కలపండి.
  16. అంతే మలాయ్ కుల్ఫీ మిశ్రమాన్ని తీసుకుని ఫ్యాన్ కిందకు పెట్టి.. కుల్ఫీ మౌల్ట్స్ లో ఈ మిశ్రమాన్ని వేస్తూ మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేస్తూ నింపండి. తర్వాత అల్యుమీనియం ఫాయిల్‌తో కవర్ చేసి.. కుల్ఫీ మౌల్ట్స్ మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్ ను గుచ్చాలి.
  17. ఇలా మలాయ్ కుల్ఫీ మిశ్రమాన్ని నింపిన కుల్ఫీ మౌల్డ్స్ ను డీప్ ఫ్రీజర్‌లో పెట్టి సుమారు 8 గంటల పాటు ఉంచాలి.
  18. తర్వాత బయటకు తీసి కుల్ఫీ మౌల్డ్స్ నుంచి మలాయ్ కుల్ఫీని తీసి దానిపై మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసి తింటే ఎవరైనా సరే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఎవరైనా..
  19. పిల్లలు, పెద్దలకు ఇష్టమైన ఈ కుల్ఫీని తక్కువ వస్తువులతో ఇంట్లోనే తయారు చేసుకోండి మరి..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..