అక్షయ తృతీయ సాయంత్రం పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుంది
అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మ పురాణంలో పేర్కొంది. ఈ రోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని వాటి ఫలాలు ఎన్నటికీ తరగవని విష్ణువు నారద మహా మునితో చెప్పాడు. కనుక అక్షయ తృతీయ రోజున సిరి సంపదలకు లోటు లేకుండా ఉండడం కోసం అనేక చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైన పనులతో పాటు కొని పనులకు దూరంగా ఉండడం మంచిది. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్ధిక సంక్షోభం నెల కొంటుంది. కనుక అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.
వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథిని అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ ఏడాది మే 10వ తేదీన అక్షయ తృతీయ ను జరుపుకోనున్నారు. ఈ రోజు శుభ సమయం అని .. ఏ పని చేసినా సక్సెస్ సొంతం అవుతుందని నమ్మకం. తమ సిరి సంపదలను పెంచుకోవడానికి బంగారం, వెండి, సహా అనేక ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మ పురాణంలో పేర్కొంది. ఈ రోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని వాటి ఫలాలు ఎన్నటికీ తరగవని విష్ణువు నారద మహా మునితో చెప్పాడు.
కనుక అక్షయ తృతీయ రోజున సిరి సంపదలకు లోటు లేకుండా ఉండడం కోసం అనేక చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైన పనులతో పాటు కొని పనులకు దూరంగా ఉండడం మంచిది. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్ధిక సంక్షోభం నెల కొంటుంది. కనుక అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.
ఇలాంటి వాటిని కొనకండి:
అక్షయ తృతీయ రోజున సందర్భంగా బంగారం లేదా వెండి కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. అయితే ఈ పవిత్రమైన రోజున వస్తువులను కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తెలియకుండా చేసే పనులతో పేదరికం బారిన పడాల్సి వస్తుంది. రోజున ప్లాస్టిక్, అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు లేదా వస్తువులను కొనడం మానుకోవాలి. ఎందుకంటే ఈ వస్తువులను రాహువు ప్రభావితం చేస్తాడని నమ్ముతారు. కొనుగోలు చేస్తే ప్రతికూలత, పేదరికం ఇంట్లోకి వస్తాయి. ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి. తెలియక కూడా ఇలాంటి వస్తువులను కొనకుండా ఉండటం చాలా ముఖ్యం.
డబ్బు అప్పుగా ఇవ్వవద్దు:
సాంప్రదాయ ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం ఇవ్వడం అశుభం అని భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంటి లోని సిరి సంపదలు మరొకరికి దగ్గరకు వెళ్తుందని నమ్ముతారు.
బంగారం, డబ్బును జాగ్రత్తగా చూసుకోండి:
అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలను పోగొట్టుకోవడం చెడు శకునంగా పరిగణించబడుతుంది. ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా అది శుభప్రదంగా పరిగణించబడదు. అటువంటి సంఘటనలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి.
సాయంత్రం చీపురుతో శుభ్రం చేయవద్దు:
హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీ దేవి చీపురులో నివసిస్తుందని భావిస్తారు. అదే సమయంలో సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చడం అశుభం. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి కోపించి ఇంటిని వదిలి వెళ్ళవచ్చు. అంతే కాకుండా సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు. అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ రోజున మధ్యాహ్నం తుడుచుకోండి.
ఇంట్లో మురికిని ఉంచవద్దు:
అక్షయ తృతీయ రోజున ఇంట్లో పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల పూజా స్థలం, ఇంట్లో డబ్బు నిల్వ ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని గుర్తుంచుకోండి. లక్ష్మీదేవి అపరిశుభ్రమైన పరిసరాలను ఇష్టపడదు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ ధూళి ఉన్న ఇంట్లోకి ప్రవేశించదు. ఈ రోజున శుభ్రం చేసుకోక పోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూలత, దురదృష్టం వస్తుంది. కావున ఈ రోజు ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతారు.
ఈ పనులు చేయవద్దు:
అక్షయ తృతీయ రోజున దొంగతనం, అబద్ధం లేదా జూదం మొదలైన తప్పులు చేయవద్దు. ఇటువంటి చర్యలు చాలా కాలం పాటు జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతికూల ఫలితాలను ఇవ్వగలవు. కనుక ఈ చర్యలకు దూరంగా ఉండాలని సూచించబడింది. ఈ పవిత్రమైన రోజున మంచి పని చేయడం, సానుకూలతను వ్యాప్తి చేయడంపై దృష్టి పెట్టాలి. జీవితంలో సుఖ సంతోషాలను ఆహ్వానించాలనుకుంటే కొన్ని చర్యలు తప్పని సరి.
అటువంటి వాటిని తినవద్దు:
అక్షయ తృతీయ రోజున మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైన వాటిని అపవిత్రమైనవి లేదా తామసమైనవిగా పరిగణించడం వలన వాటిని దూరంగా ఉంచండి. ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షించగలవు. సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి.
ఈ విషయాలను అగౌరవపరచవద్దు:
అక్షయ తృతీయ రోజున శంఖం, కౌరీ, శ్రీ యంత్రం, కుబేర యంత్రం, గణేశుడు, శ్రీ హరి విష్ణువుతో సహా దేవుళ్లను అగౌరవపరచకుండా ఉండండి. లక్ష్మీ దేవి పట్ల అగౌరవపరిచే ఏ చర్య అయినా ఆమెకు ఆగ్రహాన్ని తెప్పిస్తాయి.
లక్ష్మీదేవికి ఈ వస్తువులను సమర్పించవద్దు:
అక్షయ తృతీయ పూజ సమయంలో లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించడం అశుభం. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, ఇంటి శ్రేయస్సుకు ఆటంకాలు ఎదురవుతాయని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు