జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి.. ఏ దిశలో పూజించాలంటే..

నవగ్రహాలు మన జాతకాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఈ తొమ్మిది గ్రహాలలో శనీశ్వరుడు లేదా శని దోషం వ్యక్తిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శని గ్రహం కర్మ ఫలితాలను ఇచ్చే వ్యక్తిగా పరిగణించబడుతుంది. జీవితంలో ప్రతి రాశికి చెందిన వ్యక్తి శని దోషాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.  ముఖ్యంగా ఏలి నాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి.. శని దోష నివారణ కోసం అనేక రకాల నివారణలు సూచించబడ్డాయి. వాటిలో ఒకటి శమీ వృక్షాన్ని పూజించడం.

జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి.. ఏ దిశలో పూజించాలంటే..
Vastu Tips For Shami Plant
Follow us

|

Updated on: May 04, 2024 | 7:50 AM

మన ఇళ్లలో ఆనందం, శ్రేయస్సు , సానుకూలతను తీసుకురావడానికి తరచుగా మన ఇళ్లలో అనేక రకాల మొక్కలను పెంచుతాం. అటువంటి మొక్కల్లో ఒకటి జమ్మి చెట్టు. ఇది శనీశ్వరుడికి సంబంధించినదిగా పరిగణించబడుతోంది. ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా శనీశ్వరుడి ఆశీస్సులు చెక్కు చెదరకుండా ఉంటాయి. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ రోజు మనం ఈ మొక్కకు సంబంధించిన ఒక రెమెడీని గురించి తెలుసుకుందాం.. ఇది మీ పై కర్మ ఫలదాత ఆశీర్వాదం ఉండేలా చేస్తుంది.

జాతకంలో శని ప్రభావం

నవగ్రహాలు మన జాతకాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఈ తొమ్మిది గ్రహాలలో శనీశ్వరుడు లేదా శని దోషం వ్యక్తిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శని గ్రహం కర్మ ఫలితాలను ఇచ్చే వ్యక్తిగా పరిగణించబడుతుంది. జీవితంలో ప్రతి రాశికి చెందిన వ్యక్తి శని దోషాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.  ముఖ్యంగా ఏలి నాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి.. శని దోష నివారణ కోసం అనేక రకాల నివారణలు సూచించబడ్డాయి. వాటిలో ఒకటి శమీ వృక్షాన్ని పూజించడం.

శనీశ్వరుడికి శమీ వృక్షానికి ఉన్న సంబంధం

శనీశ్వరుడికి శమీ వృక్షం అంటే చాలా ఇష్టమని నమ్మకం. జ్యోతిషశాస్త్రంలో కూడా శమీ మొక్క చాలా అద్భుతంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం శమీ చెట్టును ఇంట్లో నాటడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుంది.

ఇవి కూడా చదవండి

రాహు స్థానం బలపడడం కోసం

శనీశ్వరుడు అనుగ్రహం పొందడానికి జమ్మి చెట్టును క్రమం తప్పకుండా పూజించడం శుభఫలితాలను ఇస్తుంది. శని వారం లేదా సోమవారం జమ్మి చెట్టు కొమ్మకు ఎరుపు రంగు కలువతో పూజ చేయాలి. కలువతో పూజ చేసే సమయంలో ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు కోసం శనీశ్వరుడిని ప్రార్థిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో రాహువు స్థానం బలపడుతుందని.. దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయని నమ్మకం.

ఏ దిశలో జమ్మి చెట్టును నాటాలంటే

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున జమ్మి చెట్టును నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటి ద్వారం వద్ద చెట్టు నాటడానికి స్థలం లేకపోతే డాబాపై దక్షిణం వైపు జమ్మి  చెట్టును నాటవచ్చు.

ఏ రోజున జమ్మి చెట్టును నాటడం శ్రేయస్కరం.

వాస్తు శాస్త్రం ప్రకారం శమీ చెట్టును శనివారం లేదా విజయదశమి రోజున నాటాలి. ఈ రోజున శమీ చెట్టును నాటడం ద్వారా శనీశ్వరుడితో పాటు శివుని అనుగ్రహం లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు