AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి.. మరో 4 రోజుల్లో 48 డిగ్రీలకు చేరే అవకాశం

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన కంటిన్యూ అవుతోంది. భానుడి భ‌గ‌భ‌గ‌లతో ప్రజ‌లు విల‌విల‌్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల‌పైనే రికార్డ్‌ కావడంతో జ‌నాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణోగ్రతలతోపాటు వేడి గాలులు కూడా తీవ్రంగా పెరిగాయని... మరో మూడు, నాలుగు రోజులపాటు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి.. మరో 4 రోజుల్లో 48 డిగ్రీలకు చేరే అవకాశం
వేసవిలో వేడిగాలుల ప్రభావం వల్ల డీహైడ్రేషన్‌తో పాటు కంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. తీవ్రమైన ఎండ, వడ గాలులు కంటికి హాని కలిగిస్తాయి. అందువల్లనే వేసవిలో కంటి సమస్యలు పెరుగుతాయి. శరీర డీహైడ్రేషన్‌తో పాటు పొడి కళ్ల సమస్య కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సమస్యల నివారణకు వేసవిలో అధికంగా నీరు తాగడంతోపాటు కళ్లపై కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Surya Kala
|

Updated on: May 04, 2024 | 6:38 AM

Share

ఏపీ, తెలంగాణలో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. గతంలో ఎన్నడూలేని ఎండ‌లు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌లు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండుటెండ‌ల‌కు తోడు ఉక్కపోత కూడా ఎక్కువవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భానుడి భగభగలు.. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ప్రధానంగా.. తెలంగాణలో సూర్యుడు నిప్పులవాన కురిపిస్తున్నాడు. పెద్దప‌ల్లి, జ‌గిత్యాల, సూర్యాపేట, ఖ‌మ్మం జిల్లాల్లో 46.7 డిగ్రీలు, న‌ల్లగొండ జిల్లాలో 46.6 డిగ్రీలు, మంచిర్యాల, క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లో 46.5, మ‌హ‌బూబాబాద్, నారాయ‌ణ‌పేట జిల్లాల్లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత‌లు న‌మోదు అయ్యాయి.

తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల‌కు పైన ఉష్ణోగ్రత‌లు న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ వెల్లడించింది. ఇక.. ఏపీలోనూ రికార్డు స్థాయి టెంపరేచర్స్‌ నమోదు అవుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో 47 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డ్‌ అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం జిల్లాలో 47 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో 46.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలో 46.6 డిగ్రీలు, కడప జిల్లాలో 46.4 డిగ్రీలు, అనంతపురం, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రకటించింది.

ఉష్ణోగ్రతలతోపాటు వేడి గాలులు కూడా తీవ్రంగా పెరిగాయని… మరో మూడు, నాలుగు రోజులపాటు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చికెన్ లేదా మటన్.. గుండెను ఆరోగ్యంగా ఉంచగలిగే శక్తి దేనికి ఉంది?
చికెన్ లేదా మటన్.. గుండెను ఆరోగ్యంగా ఉంచగలిగే శక్తి దేనికి ఉంది?
పచ్చి గుడ్లు తినడం వల్ల ఎక్కువ ప్రోటీన్ లభిస్తుందా? నిపుణులు మాట
పచ్చి గుడ్లు తినడం వల్ల ఎక్కువ ప్రోటీన్ లభిస్తుందా? నిపుణులు మాట
చిరంజీవిని ఫాలో అయిపోండి.. హిట్ కొడతారని మేనేజర్ అన్నాడు..
చిరంజీవిని ఫాలో అయిపోండి.. హిట్ కొడతారని మేనేజర్ అన్నాడు..
కారులో బయల్దేరిన 8 మంది స్నేహితులు.. గమ్యం చేరకుండానే..
కారులో బయల్దేరిన 8 మంది స్నేహితులు.. గమ్యం చేరకుండానే..
వెండి ధరలపై షాకింగ్ న్యూస్.. బడ్జెట్‌లో మరో బాంబ్..
వెండి ధరలపై షాకింగ్ న్యూస్.. బడ్జెట్‌లో మరో బాంబ్..
కష్టాల్లో ఉంటే ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. చలాకీ చంటి..
కష్టాల్లో ఉంటే ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. చలాకీ చంటి..
బ్రోకలీ vs కాలీఫ్లవర్‌ vs క్యాబేజీ.. మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్?
బ్రోకలీ vs కాలీఫ్లవర్‌ vs క్యాబేజీ.. మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్?
నా పాటతో ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 150 కోట్ల బిజినెస్..
నా పాటతో ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 150 కోట్ల బిజినెస్..
చాణక్యుడు చెప్పిన ఈ ప్రలోభాలతో మీ జీవితాలు తలకిందులే..!
చాణక్యుడు చెప్పిన ఈ ప్రలోభాలతో మీ జీవితాలు తలకిందులే..!
మన ఇళ్లల్లోనే ఉంటుంది బ్రహ్మాస్త్రం.. కానీ పట్టించుకోం..
మన ఇళ్లల్లోనే ఉంటుంది బ్రహ్మాస్త్రం.. కానీ పట్టించుకోం..