ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ.. కొనసాగుతున్న ఉత్కంఠ..

ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ.. కొనసాగుతున్న ఉత్కంఠ..

Srikar T

|

Updated on: May 03, 2024 | 10:21 PM

చివరిదశ DBT చెల్లింపుల ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. బటన్‌ నొక్కితే అకౌంట్లలోకి నగదు బదిలీ అయ్యే ప్రక్రియనే DBT అంటారు. ఇప్పటికే వివిధ పథకాలకు సంబంధించి నగదు బదిలీ ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. చదువుకునే విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యాదీవెన, లా నేస్తం నిధులు విడుదల కావాల్సి ఉంది. దీని కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. చివరిదశ చెల్లింపుల కోసం ఇప్పటికే ఈసీని అనుమతి కోరింది ప్రభుత్వం. అయితే ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అనుమతి రాలేదు.

చివరిదశ DBT చెల్లింపుల ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. బటన్‌ నొక్కితే అకౌంట్లలోకి నగదు బదిలీ అయ్యే ప్రక్రియనే DBT అంటారు. ఇప్పటికే వివిధ పథకాలకు సంబంధించి నగదు బదిలీ ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. చదువుకునే విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యాదీవెన, లా నేస్తం నిధులు విడుదల కావాల్సి ఉంది. దీని కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. చివరిదశ చెల్లింపుల కోసం ఇప్పటికే ఈసీని అనుమతి కోరింది ప్రభుత్వం. అయితే ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అనుమతి రాలేదు. గడిచిన ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలకు కోడ్ అడ్డురాదంటున్నారు వైసీపీ నాయకులు. పైగా పర్మిషన్ ఇవ్వకుండా టీడీపీ నుంచి ఎన్నికల అధికారికి ఒత్తిళ్లు ఉన్నాయని వైసీపీ ఆరోపణ చేస్తోంది. ప్రస్తుతం పెన్షన్ల తరహాలోనే ఇతర పథకాలనూ కూడా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో పొత్తు తర్వాత పర్మిషన్ల విషయంలో పరిస్థితులు మారాయంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికలు పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధుల విడుదలకు అడ్డుగా మరింది. దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని సీఈసీ స్పష్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా ఈ నిధులు విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీనిపై గతంలో వైసీపీ ఇచ్చిన వినతిని స్వాగతించి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: May 03, 2024 10:20 PM