Watch Video: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు.. చంద్రబాబుకు సీఎం జగన్ కౌంటర్..

Watch Video: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు.. చంద్రబాబుకు సీఎం జగన్ కౌంటర్..

Srikar T

|

Updated on: May 04, 2024 | 2:36 PM

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హిందూపురం ఎన్నికల ప్రచార సభలో మండిపడ్డారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ అనంతపురం జిల్లా హిందూపురంలో పర్యటించారు. జగన్‌ భూములిచ్చేవాడే గానీ.. లాక్కునేవాడు కాదన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు దిశానిర్ధేశం చేశారు. ఇప్పటికే ఐవిఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ యాక్ట్ గురించి చంద్రబాబు నాయుడుకు తెలుసా అని ప్రశ్నించారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హిందూపురం ఎన్నికల ప్రచార సభలో మండిపడ్డారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ అనంతపురం జిల్లా హిందూపురంలో పర్యటించారు. జగన్‌ భూములిచ్చేవాడే గానీ.. లాక్కునేవాడు కాదన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు దిశానిర్ధేశం చేశారు. ఇప్పటికే ఐవిఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ యాక్ట్ గురించి చంద్రబాబు నాయుడుకు తెలుసా అని ప్రశ్నించారు. భూములపై ప్రజలకు సర్వహక్కులు కల్పించేదే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ అని వివరించారు. ఇది పెద్ద సంస్కరణ కాబోతోందని సీఎం స్పష్టం చేశారు. ‌ఎలాంటి వివాదంలేదని భూములపై ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడమే ఈ చట్టం ఉద్దేశం అన్నారు. వందేళ్ల తర్వాత మళ్లీ భూసర్వే చేయించి.. సరిహద్దు రాళ్లు పెట్టిస్తున్నానన్నారు సీఎం జగన్. ఇప్పటికే17 వేల గ్రామాలకు గాను 6 వేల గ్రామాల్లో సర్వే పూర్తైందని తెలిపారు. కార్డు 2 విధానంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని.. ఇప్పటి వరకు 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. భూ హక్కుదారులకు పత్రాలు అందజేశామని కూడా తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…