Watch Video: 'ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక'.. మాజీ మంత్రి హరీష్ రావు..

Watch Video: ‘ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక’.. మాజీ మంత్రి హరీష్ రావు..

Srikar T

|

Updated on: May 03, 2024 | 8:29 PM

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‎ను మరికొన్ని సంవత్సరాలు కొనసాగించేందుకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు. కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినవన్నారు. ఏన్నో ఏళ్లుగా ఢిల్లీలో పోరాడి, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గతాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ మాదని, దీనిని మరికొన్ని రోజులు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారన్నారు.

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‎ను మరికొన్ని సంవత్సరాలు కొనసాగించేందుకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు. కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినవన్నారు. ఏన్నో ఏళ్లుగా ఢిల్లీలో పోరాడి, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గతాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ మాదని, దీనిని మరికొన్ని రోజులు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారన్నారు. అందుకే గులాబీ జెండాను గెలిపిస్తే ఢిల్లీలో తెలంగాణ ప్రజల గొంతుకను వినిపించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందన్నారు. ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. హామీలను అమలు చేయని కాంగ్రెస్ కు శిక్ష పడాలా వద్దా అని ప్రజలను అడిగారు. అందుకే ఈ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ ను గెలిపించమని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..