గంగ సప్తమి రోజున యువతులు ఇలా పూజ చేస్తే కోరుకున్న భర్త లభిస్తాడు.. పూజ విధానం, శుభ సమయం ఎప్పుడంటే..

ఈ రోజున గంగాదేవిని పూజించడం వల్ల కోరుకున్న వరుడు లభిస్తాడని, పాపాలు నశిస్తాయన్న నమ్మకం. గంగా సప్తమి రోజును గంగామాత జన్మదినంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో ఏడవ రోజున వస్తుంది. ఈ రోజున గంగామాత బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించిందని నమ్మకం. హిందూ మతంలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం గంగా సప్తమి ఎప్పుడు? ఈ రోజున పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.

గంగ సప్తమి రోజున యువతులు ఇలా పూజ చేస్తే కోరుకున్న భర్త లభిస్తాడు.. పూజ విధానం, శుభ సమయం ఎప్పుడంటే..
Ganga Saptami 2024
Follow us

|

Updated on: May 04, 2024 | 9:24 AM

గంగా సప్తమి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గంగామాతను పూజిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ఈ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని సప్తమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ రోజున గంగాదేవిని పూజించడం వల్ల కోరుకున్న వరుడు లభిస్తాడని, పాపాలు నశిస్తాయన్న నమ్మకం.

గంగా సప్తమి రోజును గంగామాత జన్మదినంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో ఏడవ రోజున వస్తుంది. ఈ రోజున గంగామాత బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించిందని నమ్మకం. హిందూ మతంలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం గంగా సప్తమి ఎప్పుడు? ఈ రోజున పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.

గంగా సప్తమి 2024 ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని సప్తమి తిథి మే 13, 2024న సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుంది.. మర్నాడు అంటే మే 14, 2024 సాయంత్రం 6:49 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథిని పరిగణలోకి తీసుకుని ఈ సంవత్సరం గంగా సప్తమిని మే 14, 2024న జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

గంగా సప్తమి పూజ విధి

  1. ఈ రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర గంగా నదిలో స్నానం చేయాలి.
  2. గంగాదేవికి పూలమాల సమర్పించండి. ఇంట్లో తయారుచేసిన స్వీట్లను సమర్పించండి.
  3. ఆ తర్వాత గంగామాతకు హారతిని ఇవ్వండి. గంగా సప్తమి రోజున దీపాలను దానం చేయడం ఒక ఆచారంగా భావిస్తారు.
  4. ఈ రోజున, పవిత్ర గంగా నది ఒడ్డున జాతరలు నిర్వహిస్తారు.
  5. గంగా సప్తమి రోజున గంగా సహస్రనామ స్తోత్రం, గాయత్రీ మంత్రాన్ని పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  6. గంగా సప్తమి రోజున ఎలాంటి తామసిక వస్తువులను తీసుకోవద్దు.
  7. ఈ రోజున వీలైనంత ఎక్కువ మతపరమైన పనిని కొనసాగించాలి. అంతేకాదు ఈ రోజున శివ, విష్ణువులను పూజించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.

గంగా సప్తమి పూజ మంత్రం

‘ఓం నమో గంగాయై విశ్వరూపిణీ నారాయణి నమో నమః గంగా గంగా’ అని వందల యోజనాల వరకు వినిపించేలా మంత్రాన్ని చెప్పేవాడు. సర్వపాపముల నుండి విముక్తుడై విష్ణులోకానికి వెళతాడు

గంగా సప్తమి ప్రాముఖ్యత

గంగా సప్తమి రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోయి సంపదలు చేకూరుతాయని చెబుతారు. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయలేకపోతే స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగాజలం వేసి అందులో గంగామాతను ఆరాధించండి. ఇలా చేయడం వల్ల గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు. ఈ రోజున గంగాపూజతో పాటు దానధర్మాలు చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇలా చేయడం ద్వారా మనిషి జీవితంలో అన్ని రకాల సుఖాలను పొందుతాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Latest Articles
ఏపీ పోలింగ్ ఘటనలపై పోలీసులు సీరియస్.. వీళ్లపై కేసులు..
ఏపీ పోలింగ్ ఘటనలపై పోలీసులు సీరియస్.. వీళ్లపై కేసులు..
ఎంత భారీ వర్షం కురిసినా 15 నిమిషాల్లోనే పిచ్ రెడీ.. ఎలా అంటే?
ఎంత భారీ వర్షం కురిసినా 15 నిమిషాల్లోనే పిచ్ రెడీ.. ఎలా అంటే?
ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరుతో మెసేజ్‌ వచ్చిందా.? క్లిక్‌ చేశారో..
ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరుతో మెసేజ్‌ వచ్చిందా.? క్లిక్‌ చేశారో..
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?
మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై..
మెడికల్ షాపులు, క్లినిక్‎లపై అధికారుల కొరడా.. డ్రగ్స్ రాకెట్‎పై..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్