AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు, అరుపులతో హడల్‌..

ఒక పురాతన పాడుబడిన కోట గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. సాయంత్రం వేళల్లో అరుపుల శబ్దాలు వినబడే దెయ్యాల కోట ఇది. పొద్దు వాలిందంటే చాలు..ఈ ప్రాంతానికి ఎవరూ వెళ్లరు. పగలు పూట ఈ కోటను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు సైతం సాయంత్రం అయిందంటే.. ఇక్కడి నుండి తిరిగి వెళ్లిపోతారు.

బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు, అరుపులతో హడల్‌..
Bhangarh Fort
Jyothi Gadda
|

Updated on: May 04, 2024 | 11:35 AM

Share

చాలా మందికి హర్రర్ సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. అందులో ఉండే సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశాలు, వెన్నులో వణుకు పుట్టించే సీన్లను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. దెయ్యాలు, భూతాలు, మంత్రాల కథనంతో నడిచే సినిమాలంటే వారికి మహా సరదా. అలాంటివి ఉంటాయని నమ్మేవాళ్లు కూడా చాలా మందే ఉంటారు. మరికొందరు ఇదంతా ఉట్టిదేనని వాటిని కొట్టిపడేసే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. కానీ, ఒక పురాతన పాడుబడిన కోట గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. సాయంత్రం వేళల్లో అరుపుల శబ్దాలు వినబడే దెయ్యాల కోట ఇది. పొద్దు వాలిందంటే చాలు..ఈ ప్రాంతానికి ఎవరూ వెళ్లరు. పగలు పూట ఈ కోటను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు సైతం సాయంత్రం అయిందంటే.. ఇక్కడి నుండి తిరిగి వెళ్లిపోతారు. ఈ హాంటెడ్ కోట రాజస్థాన్‌లో ఉంది. దీనిని చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

రాజస్థాన్‌లోని ఈ కోట పేరు భాంగార్ కోట. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్ లోని భాంగర్ కోట ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచినది. దీనిని దెయ్యాల కోట అని కూడా అంటారు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఉన్న ఈ భంగర్ ఫోర్ట్ కథ వింటే ఎవరైనా ఔరా అని ఆశ్చర్యపోతారు. ఇదొక పర్యాటక ప్రాంతమే అయినా సూర్యాస్తమయం తర్వాత ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎవ్వరినీ ఉండనివ్వరు. అందుకు గట్టి హెచ్చరికలే ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వం పెట్టడం గమనార్హం. దీన్ని బట్టే ఆ ప్రదేశం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. దీంతో సాయంత్రం అయిన వెంటనే అందరూ కోట నుండి బయటకు వచ్చేస్తారు.

భాంగర్ కోటలో ప్రతికూల శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఇప్పుడు ఈ కోట దాదాపు శిథిలావస్థలో ఉంది. రాజస్థాన్ లోని భాంగర్ కోట ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచినది. దీనిని దెయ్యాల కోట అని కూడా అంటారు. ప్రేతాత్మలు నిత్యం సంచరిస్తుంటాయని నమ్ముతారు. దీంతో రాత్రిపూట ఇందులోకి ప్రవేశాన్ని నిషేదించారు. మీరు ఈ కోటను చూడకపోతే ఈ సారి మీరు రాజస్థాన్‌ వెళ్లినప్పుడు తప్పక ఈ కోటను సందర్శించండి. ఈ కోటకు సంబంధించిన అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..