AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సన్‌రూఫ్‌ ఓపెన్‌ చేసి ప్రకృతిని ఆశ్వాదిస్తున్న ఫ్యామిలీ.. సడెన్‌గా దూసుకొచ్చి మృత్యువు.. ఏం జరిగిందంటే

Car sunroof accident: మరణం ఎప్పుడు ఎలా వస్తుందో అస్సలు చెప్పలేం అనేదానికి ఇక్కడ జరిగిన ఘటనే ఉదాహరణ.. అప్పటి వరకు భర్త కొడుకుతో సరదాగా కారులో ప్రయాణిస్తున్న 43 ఏళ్ల మహిళ.. వారి చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. కుటుంబం మొత్తం కార్లో కొండప్రాంతం సమీపంలో వెళ్తుండగా.. అకస్మాత్తుపైగా పై నుంచి దొర్లిన ఒక బండరాయి.. కారు సన్‌రూప్‌ గుండా వచ్చి కార్లో కూర్చున్న మహిళపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

సన్‌రూఫ్‌ ఓపెన్‌ చేసి ప్రకృతిని ఆశ్వాదిస్తున్న ఫ్యామిలీ.. సడెన్‌గా దూసుకొచ్చి మృత్యువు.. ఏం జరిగిందంటే
Car Sunroof Accident
Anand T
|

Updated on: Oct 31, 2025 | 3:23 PM

Share

కొండ ప్రాంతం సమీపంలో కార్లో ప్రయాణిస్తుండగా.. అకస్మాత్తుగా దొర్లిన ఒక పెద్ద బండరాయి.. కారు సన్‌రూఫ్ గుండా కార్లో ఉన్న మహిళపై పడి ఆమె మృతి చెందిన ఘటన దేశ ఆర్థిక రాజధానైనా ముంబైలో వెలుగు చూసింది. భర్త, కొడుకు కళ్ల ముందే ఆ మహిళ చనిపోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. స్థానిక వాహనదారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారులోంచి మృతదేమాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌లకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం జరిగిన వింత ప్రమాదంలో, రాయ్‌గఢ్ జిల్లాలోని కొండితార్ గ్రామ సమీపంలోని తమ్హిని ఘాట్ వద్ద జరిగింది. పూణేకు చెందిన స్నేహల్ అనే 43 ఏళ్ల మహిళ గురువారం ఉదయం 9.30 నుంచి 10 గంటల మధ్య ఆమె తన భర్త, కొడుకు, అత్తగారితో కలిసి వోక్స్‌వ్యాగన్ వర్టస్‌లో పూణే నుండి మాంగావ్‌కు బయల్దేరింది. స్నేహల్ తన భర్త డ్రైవింగ్ చేస్తున్న పక్కన ముందు సీట్లో కూర్చుంది. మిగిలిన ఇద్దరు కుటుంబ సభ్యులు వెనుక సీట్లో ఉన్నారు. అయితే వీరు కొండ ప్రాంతానికి సమీపంలోకి రాగానే..దాదాపు రెండు కిలోగ్రాముల బరువున్న ఒక రాయి నేరుగా కారుపై పడటంతో కారు సన్‌రూఫ్ మూసుకుపోయింది, ఆ తర్వాత రెండు చిన్న రాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి పడ్డాయి. దీంతో స్నేహల్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

స్నేహాల్‌కు రక్తస్రావం ఎక్కువ కావడంలో ఆమె భర్త వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. అయితే, చికిత్స పొందుతూ స్నేహల్ మరణించింది. విషయం తెలసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాదీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటననై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ప్రమాదం వదులుగా ఉన్న రాళ్ల వల్ల జరిగిందా లేదా చిన్న కొండచరియలు విరిగిపడ్డాయా అని నిర్ధారించడానికి వివరణాత్మక దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

మరోవైపు ఈ ప్రమాదం తర్వాత, రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ ఘాట్ సెక్షన్‌ను తక్షణమే భద్రతా తనిఖీ చేయాలని ఆదేశించారు. దుర్బల ప్రదేశాలను గుర్తించాలని అధికారులను సూచించారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణం చేసే డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే కొండ ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు వాహనదారులు తమ కార్ల సన్‌రూఫ్‌లను తెరవకూడదని హెచ్చరిక జారీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి