తమిళ రాజకీయాల్లో సంచలనం.. MGR తర్వాత విజయ్ ఒక్కరే.. ఆ సీన్ మళ్లీ రిపీట్!
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా వెలువడుతున్నాయి. ఈ క్రమంలో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఎంజీఆర్ తర్వాత, ఒకే ఎన్నికల్లో నేరుగా అధికార మార్పిడిని సృష్టించిన ఘనత ఇప్పుడు విజయ్‌కు దక్కే అవకాశం కనిపిస్తోంది.

దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాల్లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతోంది. మొదటి నుంచీ తమిళగ వెట్రి కళగం తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. సుమారు 50 ఏళ్లుగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే , ఏఐఏడీఎంకే వంటి చారిత్రక పార్టీలను వెనక్కి నెట్టి విజయ్ పార్టీ అగ్రస్థానంలో నిలిచింది.
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, టీవీకే 110 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగుతుండగా డీఎంకే కూటమి 71 స్థానాల్లో ఉంది. ఇక ఏఐఏడీఎంకే నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి 53 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగుతుంది. వీరందరిలో చూసుకుంటే పార్టీని స్థాపించిన కేలవం 27 నెలలకే ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్ తన తొలి ఎన్నికలోనే 100కి పైగా సీట్లను సొంతం చేసుకున్నాడు.
ఎంజీఆర్ తర్వాత మళ్లీ విజయ్ హవా!
1977లో సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎంజీఆర్ ఎలాగైతే ప్రకంపనలు సృష్టించారో, మళ్ళీ 49 ఏళ్ల తర్వాత 2026లో విజయ్ కూడా అలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తున్నారు. సుమారు 60 ఏళ్ల తర్వాత తమిళనాడులో ద్రావిడ పార్టీలు కాకుండా మరో పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు ముందడుగులు వేస్తున్నాడు. అనుకున్నట్టు కేవలం టీవీకే మాత్రమే ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం తమిళరాజకీయాల్లో దళపతి విజయ్ మరోసారి చిరిత్ర సృష్టించినట్టే.
మూడో స్థానానికి పడిపోయిన డీఎంకే
ఇప్పటికే పదేళ్లపాటు తమిళనాడులో చక్రం తిప్పి.. మరోసారి అధికారంలోకి రావాలనుకున్న డీఎంకేకు టీవీకే విజయ్ ఊహించని షాక్ ఇచ్చారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం డీఎంకే ఎవరూ ఊహించని విధంగా మూడో స్థానానికి పడిపోయింది. డీఎంకేను ఓడించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావించిన ఏఐఏడీఎంకే రెండో స్థానంలో నిలిచింది. ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగిన టీవీకే మాత్రం మెజారిటీ స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
