AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ మాస్టర్ స్ట్రోక్.. అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా..

ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేకు కోలుకోలేని బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు కీలక ఎమ్మెల్యేలు తమ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్‌కు రాజీనామా లేఖలు సమర్పించిన వెంటనే.. టీవీకే మంత్రిని కలిసి ఆ పార్టీ కండువా కప్పుకోవడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఉపఎన్నికల్లో టీవీకే నుంచి వీరు పోటీ చేస్తే అవకాశాలు ఉన్నాయి.

విజయ్ మాస్టర్ స్ట్రోక్.. అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా..
3 Aiadmk Mlas Resign
Krishna S
|

Updated on: May 25, 2026 | 4:12 PM

Share

తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికలు ముగిసినా పొలిటికల్ హీట్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా అన్నాడీఎంకేకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోలుకోలేని బిగ్ షాక్ ఇచ్చారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేశారు. అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష సమయంలోనే ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వీరు.. ఇప్పుడు అధికారికంగా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమరవేల్ నేతృత్వంలో.. పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్, ధారాపురం ఎమ్మెల్యే సత్యభామలు చెన్నై సచివాలయంలో స్పీకర్ జె.సి.పి. ప్రభాకరన్‌ను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు.

మంత్రి ఆధవ్ అర్జునతో భేటీ.. టీవీకేలోకి ఎంట్రీ

ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన వెంటనే ఈ ముగ్గురు నేతలు విజయ్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఆధవ్ అర్జునను నేరుగా కలిశారు. వారికి మంత్రి శాలువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. త్వరలోనే వీరు ముఖ్యమంత్రి విజయ్‌ను కూడా కలవనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యభామ మాట్లాడుతూ.. ‘‘తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే, తాము దివంగత ముఖ్యమంత్రి జయలలిత సుపరిపాలనను చూస్తున్నాం’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీనిపై మంత్రి ఆధవ్ అర్జున స్పందిస్తూ.. ముఖ్యమంత్రి విజయ్‌ను నమ్మి వచ్చిన మీకు ఇక అంతా మంచే జరుగుతుంది. మనమంతా ఇకపై ఒకే కుటుంబంగా ముందుకు సాగుతాం’’ అని హామీ ఇచ్చారు.

అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభం

ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి తీవ్ర అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. ఒకవైపు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం వర్గం.. ఎడప్పాడి పళనిస్వామితో తిరిగి చేతులు కలపడానికి రాయబారాలు, చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ వీడటం అన్నాడీఎంకేకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఈ ముగ్గురి రాజీనామాతో అసెంబ్లీలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల బలం 44కు పడిపోయింది. మొన్నటి బలపరీక్షలో విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చిన వీరు.. ఇప్పుడు నేరుగా టీవీకే గూటికి చేరడంతో సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం మరింత పటిష్టంగా మారింది.

తమిళనాడులో అన్నాడీఎంకే సాంప్రదాయ ఓటు బ్యాంకుకు ప్రత్యామ్నాయంగా దూసుకొచ్చిన దళపతి విజయ్.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నుండి వికెట్లను పడగొట్టడం ప్రారంభించారు. జయలలిత పాలనను విజయ్ ప్రభుత్వంలో చూస్తున్నామంటూ అన్నాడీఎంకే సీనియర్ నేతలే వ్యాఖ్యానించడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో అన్నాడీఎంకే నుండి మరికొంత మంది నేతలు టీవీకే వైపు చూసే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Follow Us
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?
వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?
ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..
మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..
అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ
అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ
కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!
కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!
సింహంతో గేమ్సా.. మత్తులో ఉందని తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్..
సింహంతో గేమ్సా.. మత్తులో ఉందని తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్..
భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. వైరల్ అవుతున్న బాబా వంగా జ్యోస్యం
భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. వైరల్ అవుతున్న బాబా వంగా జ్యోస్యం