AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ముసలి వాళ్లు కూడా లొట్టలేసుకొని తింటారు!

స్వీట్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది ఎతో ఇష్టంగా స్వీట్ తింటారు. అయితే బయట కొనుగోలు చేసే పని లేకుండా, ఇంటిలోనే చాలా సులభంగా ఇలా స్వీట్ మైసూర్ పాక్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. అంతే కాకుండా ముసలి వాళ్లు కూడా చాలా ఇష్టంగా లొట్టలేసుకొని మరి తింటారు. కావాల్సిన పదార్థాలు : శనగ పిండి ఒక కప్పు, మంచి రుచి కోసం సన్ ఫ్లవర్ ఆయిల్ ఒక కప్పు, నెయ్యి అర కప్పు, పంచదార కప్పున్నర, రెండు కప్పులు.

Samatha J
|

Updated on: Jun 24, 2026 | 4:56 PM

Share
తయారీ విధానంలోకి వెళితే..    ముందుగా, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. తర్వాత, అదే కప్పుతో ఒక కప్పు  ఆయిల్, అర కప్పు నెయ్యిని కలపాలి. శనగపిండికి సరిపడా నూనె, నెయ్యి కలిపి ఒకటిన్నర కప్పు ఉండేలా చూసుకోవాలి. ఇది మైసూర్ పాక్ పర్ఫెక్ట్‌గా రావడానికి చాలా ముఖ్యం. ఇందులో ఉండలు ఏవీ లేకుండా  స్పూన్‌తో చక్కగా కలుపుకోవాలి. తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి.

1 / 5
ఇప్పుడు మైసూర్ పాక్ పాన్ రెడీ చేసుకోవాలి. దాని కోసం పాన్ తీసుకొని, దానికి నెయ్యి మొత్తం మంచిగా రాసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పంచదార పాకం తయారు చేసుకోవాలి. కాగా, దీనిని ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

2 / 5
దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో శనగ పిండి తీసుకున్న కప్పుతో, ఒకటిన్నరగ కప్పు పంచదారను వేయాలి. తర్వాత ముప్పావు కప్పు నీళ్లు పోసి , పంచదార కరికే వరకు కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ, తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. దీంతో పాకం తయారు అవుతుంది.

3 / 5
పాకం తయారు అయిన తర్వాత అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగ పిండి మిశ్రమాన్ని వేయాలి. ఉండలు లేకుండా మంచిగా కలపాలి. మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, మిశ్రమం దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. అది బాగా దగ్గర పడి, విడిపోతూ ఉంటుంది. ఇలా బాగా ఉడకడం వలన రంగు, రుచి అద్భుతంగా ఉంటుంది.

4 / 5
ఇప్పుడు నురగ వచ్చి, మిశ్రమం వేరు అవుతున్న సమయంలో, స్టవ్ ఆఫ్ చేసి, ఒక నిమిషం పాటు బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న పాన్‌లో వేయాలి. తర్వాత దీనిని సమానంగా స్ప్రెడ్ చేయాలి. దీనిని చల్లబరుచుకోవాలి. తర్వాత దీనిని మీకు కావాల్సిన ఆకారంలో తయారు చేసుకొని కట్ చేసుకోవాలి. అంతే, మైసూర్ పాక్ రెడీ.

5 / 5
Follow Us