అరెరే లవంగాలతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?.. ఇన్నాళ్లు తెలీదే!

24 Jun 2026

Anand T

మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా అనేక మంది చర్మ, జుట్టు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిని చెక్‌ పెట్టేందుకు లవంగాలు ఎంతగానో ఉపయోగపడుతాయని నిపునులు చెబుతున్నారు.  

లవంగం బెనిఫిట్స్

లవంగాలలో ఉండే యూజినాల్ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపి.. ఇది చర్మంపై వచ్చే దద్దుర్లు, వాపులను తగ్గిస్తుంది.

మొటిమల నివారణ

వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా రక్షించి.. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుస్తాయి.

మెరిసే చర్మం

లవంగాల్లోని యాంటీసెప్టిక్ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్లను, చర్మ సమస్యలను నివారించడంతో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఇన్ఫెక్షన్ల రక్షణ

లవంగాలలోని యాంటీ ఫంగల్ గుణాలు తలపై ఫంగస్ పెరుగుదలను నిరోధించి జుట్టు రాలడానికి కారణమైన చుండ్రు తగ్గిస్తాయి.

చుండ్రుకు చెక్

లవంగాల వల్ల తల చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల వెంట్రుకల కుదుళ్లకు అవసరమైన పోషకాలు అందుతాయి.

రక్త ప్రసరణ

లవంగాల నీటితో తలస్నానం చేయడం వల్ల మీ జుట్టుకు అద్భుతమైన సహజమైన మెరుపు, మృదుత్వం వస్తాయి. ఇది జుట్టు పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది.

సహజమైన మెరుపు

సున్నితమైన చర్మం ఉన్నవారు లవంగం ఉత్పత్తులను వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ దురద లేదా మంట అనిపిస్తే వెంటనే వాడటం ఆపేయాలి.

ప్యాచ్ టెస్ట్