AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sia Goel: సియా గోయల్- చేతన్ మధ్య 2004 ఫోన్‌ కాల్స్‌.. 238 గంటల సంభాషణ

పుణెలో సంచలనం సృష్టించిన బిజినెస్‌మెన్ కుమారుడు కేతన్ హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాబోయే భార్య సియా గోయల్.. తన ప్రియుడు చేతన్‌తో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం కేతన్‌ను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. సీసీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా, కుటుంబ సభ్యుల ఫిర్యాదులతో ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ నిందితుల కుట్ర మరింత స్పష్టమవుతోంది.

Sia Goel: సియా గోయల్- చేతన్ మధ్య 2004 ఫోన్‌ కాల్స్‌..  238 గంటల సంభాషణ
Pune Ketan Murder Case
Ram Naramaneni
|

Updated on: Jun 24, 2026 | 1:35 PM

Share

పుణెలో బిజినెస్‌మెన్ కుమారుడు కేతన్ హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తొలుత ప్రమాద మరణంగా కనిపించిన ఈ ఘటన వెనుక ప్రేమ, మోసం, ముందస్తు కుట్ర దాగి ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కేతన్‌ను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది సియా, చేతన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు. ఇద్దరి మధ్య మొత్తం 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు, దాదాపు 238 గంటల పాటు మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే వారి మధ్య ఉన్న సన్నిహిత సంబంధంతో పాటు హత్య కుట్రకు బలమైన ఆధారంగా మారింది.

దర్యాప్తు ప్రకారం.. కేతన్‌ను హత్య చేయడానికి సియా గతంలోనే ఒకసారి ప్రయత్నించింది. లోహ్‌గఢ్ కోటకు తీసుకెళ్లి లోయలోకి తోసేయగా.. చెట్టు కొమ్మను పట్టుకుని కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో పాము కనిపించడంతో భయపడి తోసేశానంటూ సియా నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో ఆ ఘటనను ప్రమాదంగానే భావించారు. అయితే మొదటి ప్రయత్నం విఫలమైనా.. సియా వెనక్కి తగ్గలేదు. ఈసారి ప్రియుడు చేతన్‌తో కలిసి పక్కా ప్రణాళిక రూపొందించింది. జూన్ 18న బర్త్‌డే పేరుతో మరోసారి అదే ప్రాంతానికి కేతన్‌ను తీసుకెళ్లి హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. ట్రెక్కింగ్ చేస్తుండగా గాలికి బ్యాలెన్స్ కోల్పోయి లోయలో పడిపోయాడని సియా చెప్పినా.. ఆమె వాంగ్మూలంలో అనేక ప్రశ్నలు కనిపించాయి.

ఇక ఈ కేసును ఛేదించడంలో సీసీ కెమెరా దృశ్యాలు కీలకంగా మారాయి. లోహ్‌గఢ్ కోటకు వెళ్లే మార్గంలో తీవ్ర ఎండలోనూ హుడీ, ముసుగు ధరించి తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. 33 డిగ్రీల ఉష్ణోగ్రతలో అలాంటి దుస్తులు ధరించడంపై అనుమానం రావడంతో అతడి వివరాలు ఆరా తీశారు. ఫొటోలను పోల్చి చూడగా.. అతడే సియా ప్రియుడు చేతన్ అని నిర్ధారణ అయింది. పోలీసులకు చిక్కకుండా ఉండాలనుకున్న ముసుగే చివరకు అతడిని పట్టించింది.

సియా ప్రవర్తనపై మొదటి నుంచే అనుమానం వ్యక్తం చేసిన కేతన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ముమ్మరమైంది. కాల్ డేటా, సీసీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు.. ఇది ప్రమాదం కాదు, ముందే పథకం వేసి చేసిన హత్య అని నిర్ధారించి సియా గోయల్, చేతన్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
పోలీసులకు పట్టించేలా చేసిన చేతన్ ముసుగు వేషం
పోలీసులకు పట్టించేలా చేసిన చేతన్ ముసుగు వేషం
గుండెను కాపాడే సహజ ఔషధం.. ఈ పానియం రోజూ గ్లాసుడు తాగినా చాలు
గుండెను కాపాడే సహజ ఔషధం.. ఈ పానియం రోజూ గ్లాసుడు తాగినా చాలు
రూ.వెయ్యిలోపే బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్లు.. మీకు తెలుసా..?
రూ.వెయ్యిలోపే బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్లు.. మీకు తెలుసా..?
మీ జీతాన్ని బట్టి.. మీరు ఏ బైక్ కొనాలో.. ఇలా ఈజీగా తెలుసుకోండి
మీ జీతాన్ని బట్టి.. మీరు ఏ బైక్ కొనాలో.. ఇలా ఈజీగా తెలుసుకోండి
తనను జైలుకు పంపమని చాలా రిక్వెస్ట్ చేశాడు.. అలా జరక్కపోవడంతో
తనను జైలుకు పంపమని చాలా రిక్వెస్ట్ చేశాడు.. అలా జరక్కపోవడంతో
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. రోహిత్ శర్మ రికార్డుపై కన్నేసిన సంజూ
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. రోహిత్ శర్మ రికార్డుపై కన్నేసిన సంజూ
ఏ వంటకు ఏ నూనె వాడాలి? ఆరోగ్యానికి ఏ వంట నూనె బెస్ట్?
ఏ వంటకు ఏ నూనె వాడాలి? ఆరోగ్యానికి ఏ వంట నూనె బెస్ట్?
ఆఫీస్‌కు దూరం.. మనుషులకు కూడా దూరమేనా? వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పేచీ..
ఆఫీస్‌కు దూరం.. మనుషులకు కూడా దూరమేనా? వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పేచీ..
చరమాంకాన్ని మాతృభూమిలోనే గడపాలనే సంకల్పంతో..
చరమాంకాన్ని మాతృభూమిలోనే గడపాలనే సంకల్పంతో..
AI యుగంలో టీచర్లకు BEd ఒక్కటే సరిపోతుందా? ప్రమాదంలో ఉపాధ్యాయులు
AI యుగంలో టీచర్లకు BEd ఒక్కటే సరిపోతుందా? ప్రమాదంలో ఉపాధ్యాయులు