AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Purifier: కేవలం రూ.వెయ్యికే వాటర్ ప్యూరిఫైయర్లు.. వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు.. బెస్ట్ ఆప్షన్స్ ఇవే..

వాటర్ ప్యూరిఫైయర్ కొనాలంటే రూ.10 వేలపైమాటే. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అది భారంతో కూడుకున్న పని. అయితే ఇప్పుడు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా రూ.వెయ్యిలోపు ధరల్లోనే ప్యూరిఫైయర్ సౌకర్యం పొందవచ్చు. ఇందుకోసం మార్కెట్లో అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

Water Purifier: కేవలం రూ.వెయ్యికే వాటర్ ప్యూరిఫైయర్లు.. వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు.. బెస్ట్ ఆప్షన్స్ ఇవే..
Portable Water Purifier
Venkatrao Lella
|

Updated on: Jun 24, 2026 | 1:33 PM

Share

వాటర్ క్యాన్లు తెచ్చుకునే కాలం పోయింది. ఇప్పుడు ఎక్కువమంది ఇళ్లల్లో వాటర్ ప్యూరిఫైయర్లు ఉంటున్నాయి. రూ.10 వేల నుంచి వీటి ధరలు ప్రారంభమవుతున్నాయి.  మంచి కంపెనీ బ్రాండ్ కావాలంటే రూ. 15 వేల వరకు ఉంటుంది. ఇక కెపాసిటీని బట్టి ఆపై ధరల్లో కూడా లభిస్తున్నాయి. ఇక సిటీలల్లో రెంటల్ బేస్ మీద కూడా వాటర్ ప్యూరిఫైయర్లు  అందుబాటులో ఉంటున్నాయి. అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఎక్కువగా రెంటల్ వాటర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఖరీదైన RO లేకుండా శుభ్రమైన నీటి కోసం చూస్తున్నారా? ఇందుకోసం అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. గ్రావిటీ ఫిల్టర్లు, నాన్-ఎలక్ట్రిక్ ప్యూరిఫైయర్‌ల వంటి RO-యేతర పరికరాల ద్వారా రూ.వెయ్యిలోపు ఖర్చుతో మంచినీటి సౌకర్యం పొందవచ్చు.

గ్రావిటీ వాటర్ ఫిల్టర్

ఈ పరికరం విద్యుత్ లేకపోయినా పనిచేస్తుంది. నీటిని సహజ పద్ధతిలో శుభ్రపరుస్తూ బ్యాక్టీరియా, దుమ్ము, మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. దీని ధర కేవలం రూ. 500 నుండి రూ.1000 మధ్య ఉంటుంది. రోజువారీ ఉపయోగం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

విద్యుత్ రహిత నీటి ఫిల్టర్

ఈ పరికరం విద్యుత్ లేకుండా నీటిని శుద్ధి చేసి దాని రుచిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా TDS స్థాయిలను సమతుల్యం చేయడానికి కూడా సహాయపడుతుంది. PGలు, హాస్టళ్లకు ఉత్తమ ఎంపికగా భావిస్తారు.

ఆరు-పొరల ట్యాప్ ఫిల్టర్

మీరు ఈ ఫిల్టర్‌ను నేరుగా మీ కుళాయికి అమర్చుకోవచ్చు. ఈ పరికరం నీటిని పలు దశల ద్వారా శుభ్రపరుస్తుంది. నీటిలోని మురికి, సూక్ష్మ కణాలను 6 దశలుగా తొలలగిస్తుంది. రూ.100 నుంచి రూ.300 మధ్య ధరలో ఇది లభిస్తుంది.

పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్

మీరు ప్రయాణాలకు వెళ్తుంటే ఇది మంచి ఎంపిక. నది లేదా వాగులోని నీటిని వడపోసి శుభ్రపరుస్తుంది. దీనిని తేలికగా, సులభంగా తీసుకెళ్లవచ్చు. ట్రెక్కింగ్, అత్యవసర పరిస్థితులలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ధర రూ.వెయ్యిగా ఉంది.

యాక్టివేటెడ్ కార్బన్ వాటర్ ఫిల్టర్

ఈ పరికరం నీటిలోని దుర్వాసన, క్లోరిన్, ఇతర మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది నీటి రుచిని మెరుగుపరుస్తుంది. దీని ధర కూడా చాలా తక్కువ. చిన్న గృహ అవసరాలకు ఇది ఒక సులభమైన, అద్భుతమైన ఎంపికగా చెప్పవచ్చు.

FAQ’S

ప్రశ్న: పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్ సురక్షితమైనా..?

జవాబు: ఇది పూర్తిగా సురక్షితమే. ప్రయాణాలు చేసేవారికి బెస్ట్ ఆప్షన్

ప్రశ్న: ఆర్వో మెషిన్ లేకుండా వాటర్ ప్యూరిఫైయర్లు వాడటం మంచిదేనా..?

జవాబు: ఈ వాటర్ ప్యూరిఫైయర్లు పూర్తిగా నిర్ధారించినవి. అనేక పరీక్షల్లో విజయవంతం అయ్యాయి

Follow Us