AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

ఎండల్లో లీటర్ల కొద్దీ నీళ్లు తాగినా నీరసం తగ్గట్లేదా.. అయితే ఎలక్ట్రోలైట్ల గురించి తెలుసుకోండి..

ఎండల్లో ఎంత నీరు తాగినా మధ్యాహ్న సమయానికి విపరీతమైన నీరసం, అలసట, తలనొప్పి వేధిస్తున్నాయా? అయితే మీ శరీరంలో కేవలం నీరు మాత్రమే కాదు.. అత్యంత కీలకమైన ఎలక్ట్రోలైట్లు కూడా ఆవిరైపోతున్నాయని అర్థం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న ఈ ముదురు వేసవిలో వడదెబ్బ నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి, సరైన హైడ్రేషన్ పద్ధతులు ఎలా పాటించాలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: May 25, 2026 | 7:48 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడిపోతున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల మార్కును దాటేసి నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఇలాంటి రికార్డు స్థాయి వేడిమిని తట్టుకోవడానికి, వడదెబ్బ, తీవ్ర అలసట నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి సరైన హైడ్రేషన్ పద్ధతులు పాటించడం అత్యవశ్యకం. అయితే వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి కేవలం నీరు మాత్రమే సరిపోతుంది అనేది ఒక సాధారణ అపోహ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కేవలం నీరు ఎందుకు సరిపోదు?

ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఎక్కువ గంటలు తీరిక లేకుండా పనులు చేస్తున్నప్పుడు మన శరీరం విపరీతంగా చెమటను ఉత్పత్తి చేస్తుంది. ఈ చెమట రూపంలో శరీరం కేవలం నీటిని మాత్రమే కాకుండా.. తనలోని అనేక కీలకమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది. శరీరం నుండి ఈ ఎలక్ట్రోలైట్లు ఆవిరైపోవడమే మధ్యాహ్న సమయంలో ఎదురయ్యే విపరీతమైన నీరసం, కాళ్లు, చేతులు లాగడం, అలసట, తలనొప్పి, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలకు ప్రధాన కారణం.

ఎలక్ట్రోలైట్లు లేకపోతే డేంజర్..

సరైన మోతాదులో శరీరానికి ఎలక్ట్రోలైట్లు అందకుండా కేవలం లీటర్ల కొద్దీ నీరు మాత్రమే త్రాగడం వల్ల శరీరం పూర్తిస్థాయిలో హైడ్రేట్ అవ్వదు. ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటే బాడీ సిస్టమ్ నెమ్మదిస్తుంది. కాబట్టి వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నీటితో పాటు ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడం అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.

ఎలక్ట్రోలైట్లు లభించాలంటే ఏం చేయాలి?

ఎండల బారిన పడకుండా ఉండటానికి కేవలం సాదా నీటిపైనే ఆధారపడకుండా, నిత్యం ఎలక్ట్రోలైట్లను అందించే ఈ పానీయాలు లేదా ఆహార పదార్థాలను మీ రోజువారి డైట్‌లో భాగం చేసుకోవాలి.

ఓఆర్ఎస్ ద్రావణం: నీరసంగా అనిపించినప్పుడు ఓఆర్ఎస్ కలుపుకుని తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

కొబ్బరినీళ్లు: ఇవి ప్రకృతి ప్రసాదించిన బెస్ట్ ఎలక్ట్రోలైట్ డ్రింక్. ఇందులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

మజ్జిక: కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి వేసిన చల్లటి మజ్జిక శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

నిమ్మకాయ నీరు: నీటిలో కొద్దిగా ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.