రోజూ క్యారెట్ తింటే కంటిచూపు బాగుంటుందని మనందరం వినే ఉంటాం. కానీ ఆ మాటను పెద్దగా పట్టించుకోక కళ్లజోళ్లు కొనితెచ్చుకుంటాం
TV9 Telugu
క్యారెట్ కళ్లకే కాదు మరెన్నో విధాల మేలు చేస్తుంది. క్యారెట్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్నది తెలిసిందే. ఆ జాబితాలోకి మరో ప్రయోజనమూ చేరింది
TV9 Telugu
అదేంటంటే, చాపకింద నీరులా ప్రపంచాన్ని చుట్టేస్తున్న టైప్-2 డయాబెటిస్‌ని అదుపు చేయడంలో క్యారెట్లు కీలకమని సదరన్ డెన్మార్క్, కోపెన్‌హాగన్ యూనివర్సిటీల పరిశోధనలో తేలింది
TV9 Telugu
టైప్-2 డయాబెటిస్‌ని నిర్లక్ష్యం చేస్తే గుండెజబ్బులూ, కిడ్నీ సమస్యలూ, చూపు తగ్గిపోవడం వంటి అనారోగ్యాలు తలెత్తుతాయి
TV9 Telugu
పరిస్థితి అంతవరకూ వెళ్లకూడదంటే, రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా చూసుకోవాలి. అంటే, ఈ వ్యాధి అదుపులో ఉండాలంటే చికిత్సతోపాటూ మంచి ఆహారపు అలవాట్లు అవసరం
TV9 Telugu
జీర్ణవ్యవస్థా ఆరోగ్యంగా ఉండాలి. క్యారెట్లలోని బయోయాక్టివ్ కాంపౌండ్లకి ఆ శక్తి ఉందట. ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడటం వల్ల చికిత్స ఫలితాలు నూటికినూరు శాతం అందుతాయి
TV9 Telugu
ఇందుకోసం క్యారెట్లని వేయించీ, ఉడకబెట్టీ- ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఫలితం ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. క్యారెట్లలో లుటీన్, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి
TV9 Telugu
అందువల్ల మెదడు పనితీరును ఇవి మెరుగు పరుస్తాయి. దీంతో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటాం. అలర్ట్‌నెస్ పెరుగుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది