టిక్ టాక్ వీడియోస్, రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది దీపికా పిల్లి. అనంతరం ఈ అమ్మడు బుల్లితెరపై యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించింది.
బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేసిన ఈ అమ్మడు.. అటు వెండితెరపై అవకాశాలు అందుకుంది. పలు చిత్రాల్లో కథానాయికగా కనిపించి నటిగా పాపులర్ అయ్యింది.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోషూట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. సరికొత్త ఫోటోషూట్‌లో దీపికా పిల్లి స్టైలిష్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయింది.
స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్, దానికి మ్యాచింగ్ ప్యాంట్‌లో సింపుల్‌గా, అంతే ఎలిగెంట్‌గా కనిపిస్తోంది. ఆమె వేసుకున్న కాటుక కళ్ళు, విరబోసిన జుట్టు ఆమె అందాన్ని మరింత పెంచేశాయి.
ఈ మత్తెక్కించే చూపులతో దీపికా కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోందని చెప్పవచ్చు. చేతికి వేసుకున్న మెటాలిక్ గాజులు ఈ వెస్ట్రన్ లుక్‌కు చక్కని స్టైలిష్ టచ్ ఇచ్చాయి.
ఈ ఫోటోలను చూసిన అభిమానులు సోషల్ మీడియోలో "బ్లాక్ బ్యూటీ", "మత్తెక్కించే కాటుక కళ్ళు", "హాట్ లుక్స్" అంటూ నెటిజన్లు రకరకాలుగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
గ్లామర్ పరంగా గీత దాటకుండానే, కేవలం తన హావభావాలు, స్టైలింగ్‌తో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ బ్లాక్ డ్రెస్ లో మరింత అందంగా మెరిసిపోయింది.
బుల్లితెరపై గలగలా మాట్లాడే యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా, ఇలాంటి మోడ్రన్, స్టైలిష్ ఫోటోషూట్లతో వెండితెరపై కూడా స్టార్ హీరోయిన్‌గా రాణించేందుకు ట్రై చేస్తుంది.