AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC 2026 Admit Card: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్‌ రైల్వే అడ్మిట్‌ కార్డులు వచ్చేశాయ్.. ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి

RRB NTPC UG 2026 Admit cards: రైల్వే శాఖలో ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు మరో 2 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో RRB అడ్మిట్ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా..

RRB NTPC 2026 Admit Card: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్‌ రైల్వే అడ్మిట్‌ కార్డులు వచ్చేశాయ్.. ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి
RRB NTPC UG CBT 1 admit cards
Srilakshmi C
|

Updated on: May 04, 2026 | 5:24 PM

Share

హైదరాబాద్‌, మే 4: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో వివిధ ఉద్యోగాల భర్తీకి ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 2026 రాత పరీక్షలు మరో రెండు రోజుల్లోనే జరగనున్నాయి. ఈ క్రమంలో మొదటి విడత పరీక్ష సీబీటీ 1 పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) అడ్మిట్‌ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్‌ సీబీటీ 1 ఆన్‌లైన్ రాత పరీక్షలు మే 7వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రారంభం కానున్నాయి. మే 7, 8, 9 తేదీల్లో, జూన్ 13, 14, 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. సీబీటీ 1లో మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో 90 నిమిషాల పాటు పరీక్ష జరుగుతుంది. నెగటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. అంటే ప్రతి మూడు తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున కోత విధిస్తారన్నమాట. జనరల్ అవేర్‌నెస్‌ విభాగం నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్‌ విభాగం నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ నుంచి 30 ప్రశ్నల చొప్పున అడుగుతారు.

ఆయే తేదీల్లో పరీక్షా కేంద్రానికి వెళ్లేవారు హాల్‌టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో ఐడెంటిటీ కార్డును తమ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత అందులో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారులను 9513166169 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి సరిచేసుకోవాలని అధికారులు సూచించారు. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా చెక్‌ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సీబీటీ 1 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us