TTD Temple: జమ్ముకశ్మీర్‌లో టీటీడీ ఆలయం ఎలా ఉందో చూశారా ?
దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న టీటీడీ ఉత్తరాదిలోని జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది. వైఖానస ఆగమోక్తంగా, సర్వాంగ సుందరంగా ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. మాత వైష్ణోదేవి దర్శనం కోసం జమ్మూ వచ్చే భక్తులకు శ్రీవారి ఆలయ సందర్శన మరో ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వనుంది.

దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న టీటీడీ ఉత్తరాదిలోని జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది. వైఖానస ఆగమోక్తంగా, సర్వాంగ సుందరంగా ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. మాత వైష్ణోదేవి దర్శనం కోసం జమ్మూ వచ్చే భక్తులకు శ్రీవారి ఆలయ సందర్శన మరో ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వనుంది. ఇక్కడ మజీన్ అనే గ్రామంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8న జరుగనుంది. ఇందుకోసం జూన్ 3వ తేదీ నుండి వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Temple
జూన్ 3న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆచార్యవరణం, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. జూన్ 4న ఉదయం 8 నుండి 11 గంటల వరకు పంచగవ్యప్రాసన, వాస్తు హోమం, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు అగ్ని ప్రతిష్ట, కుంభ స్థాపన, కుంభారాధన, విశేష హోమం నిర్వహిస్తారు. జూన్ 5న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, అక్షిన్మోచనం, నవకలశ స్నపనం, పంచగవ్యాధివాసం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు. జూన్ 6న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, నవకలశ స్నపనం, క్షీరాధివాసం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.





Temple
మరిన్ని జాతీయ వార్తల కోసం