Watch Video: ఏనుగులు రైల్వే ట్రాక్ సులభంగా దాటేలా వినూత్న ఏర్పాటు.. వీడియో వైరల్
అటవీ ప్రాంతంలో ఉండే రైల్వే ట్రాక్‌ను దాటేటప్పుడు కొన్ని ఏనుగులు గాయపడడం లాంటి ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. గజరాజుల గుంపును గమనించి లోకో పైలట్లు రైలు బ్రేకులు వేస్తున్నప్పటికీ అప్పటికే సమయం దాటిపోవడంతో ప్రమాదాలు ఆగలేకపోతున్నాయి.
అటవీ ప్రాంతంలో ఉండే రైల్వే ట్రాక్‌ను దాటేటప్పుడు కొన్ని ఏనుగులు గాయపడడం లాంటి ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. గజరాజుల గుంపును గమనించి లోకో పైలట్లు రైలు బ్రేకులు వేస్తున్నప్పటికీ అప్పటికే సమయం దాటిపోవడంతో ప్రమాదాలు ఆగలేకపోతున్నాయి. అయితే వీటిని నివారించేందుకు అధికారులు ఓ సరికొత్త ప్రయత్నం చేశారు. వివిధ ప్రాంతాల్లో క్రాసింగ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలు ఆపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అస్సాం అటవీశాఖ అధికారులు ఏనుగులను దాటించేందుకు వినూత్న ఆలోచన చేశారు.
ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటేందుకు ఓ ర్యాంప్‌ను ఏర్పాటు చేశారు. సుశాంత నంద అనే ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియో జంతు ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.
An effective way to reduce elephant deaths on Railway tracks. Ramp for the gentle giants to cross the tracks is a much simpler way to reduce the conflict. Source:Assam FD pic.twitter.com/VZfwPjfwHG
— Susanta Nanda (@susantananda3) May 31, 2023
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..