నీళ్లలో పడి మునిగిపోతున్న కాకి.. అక్కడే ఉన్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి
ప్రేమ, సానుభూతి, ఎదుటి వారికి సాయం చేసే గుణం మనుషులకే కాదు.. జంతువుల్లోనూ ఉంటుంది. క్రూర జంతువులు కూడా ఒక్కోసారి ఆపదలో ఉన్న చిన్న జీవులపై జాలి చూపిస్తుంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. నీటిలో పడి ప్రాణాలు కోల్పోతున్న ఓ కాకికి ఎలుగుబంటి ఎలా సాయం చేసిందో చూస్తే..
ప్రేమ, సానుభూతి, ఎదుటి వారికి సాయం చేసే గుణం మనుషులకే కాదు.. జంతువుల్లోనూ ఉంటుంది. క్రూర జంతువులు కూడా ఒక్కోసారి ఆపదలో ఉన్న చిన్న జీవులపై జాలి చూపిస్తుంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. నీటిలో పడి ప్రాణాలు కోల్పోతున్న ఓ కాకికి ఎలుగుబంటి ఎలా సాయం చేసిందో చూస్తే ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హంగేరిలోని బుదాపేస్ట్ జూలో ఓ కొలనులో ప్రమాదవశాత్తు ఓ కాకి పడిపోయింది. పాపం అది నీటిలో మునిగిపోతూ ప్రాణాలకోసం కొట్టుమిట్టాడుతోంది. అదే సమయంలో కొలను గట్టున ఓ ఎలుగుబంటి ఆహారం తింటూ ఉంది. నీటిలో పడి నిస్సహాయ స్థితిలో ఉన్న కాకిని చూసి ఎలుగుబంటి మనసు కరిగిపోయింది. ఆ కాకి తనను చూసి భయపడుతుందేమోనని మొదట కొంచెం తటపటాయించింది. తర్వాత ఇంక కాకిపరిస్థితిని చూసి అడుగు ముందుకేసింది. నీటిలో మునిగిపోతున్న కాకిని ఎలుగుబంటి చటుక్కున పట్టుకుని ఒడ్డున పడేసి రక్షించింది. ఆ తర్వాత ఎలుగుబంటి తన దారిన తను అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అయితే కాకి కాసేపటివరకూ కదల్లేకపోయింది. ఆ తర్వాత మెల్లగా కోలుకుని అక్కడి నుంచి ఎగిరిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోని ఇప్పటికే నాలుగున్నర మిలియన్లమందికి పైగా వీక్షించారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో చాలా మంది షేర్ చేస్తున్నారు. లైక్ చేస్తున్నారు. ఎలుగుబంటి ఔదార్యానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

