అంతరించిపోతున్న అరుదైన జంతువు..
ఈ భూమిపై అందమైన జంతువుల్లో పాండాలు ప్రత్యేకమైనవి. వాటిలో రెడ్ పాండాలను ఎంత సేపు చూసినా తనివి తీరదు. అవి అలా నడుస్తూ వెళ్తుంటే... చిన్న సైజు టెడ్డీ బేర్ కదులుతున్నట్లే ఉంటుంది. వాటి రంగు, బొచ్చు, తోక, ఆకారం అన్నీ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటాయి. క్యూట్‌గా ఉండే ఈ మూగ జీవాలు ప్రస్తుతం..
ఈ భూమిపై అందమైన జంతువుల్లో పాండాలు ప్రత్యేకమైనవి. వాటిలో రెడ్ పాండాలను ఎంత సేపు చూసినా తనివి తీరదు. అవి అలా నడుస్తూ వెళ్తుంటే… చిన్న సైజు టెడ్డీ బేర్ కదులుతున్నట్లే ఉంటుంది. వాటి రంగు, బొచ్చు, తోక, ఆకారం అన్నీ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటాయి. క్యూట్‌గా ఉండే ఈ మూగ జీవాలు ప్రస్తుతం అంతరించిపోయే జంతువుల జాబితాలో చేరిపోయాయి. తాజాగా వీటికి సంబంధించిన ఓ వీడియోని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోని అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ ఖండు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అందమైన ఓ రెడ్‌కలర్ పాండా చెట్టుపైన చిటారు కొమ్మన కూర్చుని ఉంది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘‘అందంగా ఉన్న ఈ చిన్న రెడ్ పాండా తవాంగ్ లో కనిపించింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచుర్ ‘అంతరించి పోతున్న జాతుల్లో’ ఇది కూడా ఉంది. వెదురు పుల్లలు, ఆకులను తిని జీవించే ఈ పాండాలకు హిమాలయ పర్వత ప్రాంతాలు ఆలవాలంగా ఉన్నాయి. మనమంతా కలసి వాటిని సంరక్షిద్దాం. జీవ వైవిధ్యానికి అవి ఎంతో ముఖ్యం’’ అని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమఖండు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్విట్‌పై స్పందించిన కిరణ్ రిజుజు ‘‘ఎంతో ఆదరణీయమైన ఈ చిన్న ఎర్ర పాండా వీడియోను అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ ఖాండు దీన్ని షేర్ చేశారు. అందమైన ఈ జంతువులను మనం కాపాడుకుందాం’’ అంటూ కిరణ్ రిజిజు రీ ట్వీట్ చేశారు. అలాగే, ఎర్రపాండా ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్లోని కలింపోంగ్ జిల్లాల్లో ఇది కనిపిస్తుంది’’ అని రిజుజు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీళ్లలో పడి మునిగిపోతున్న కాకి.. అక్కడే ఉన్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

