సో క్యూట్.. భారతీయ రుచులకు ఫిదా అవుతున్న న్యూయార్క్ చిన్నారి
భారత సంస్కృతి, సంప్రదాయాలే కాదు.. వంటకాలూ ఎంతో ప్రత్యేకం. ప్రపంచ ప్రముఖులు సైతం భారతీయ వంటకాలకు ఫిదా అవుతుంటారు. తాజాగా న్యూయార్క్ నగరంలో ఓ పసిపాప భారతీయ ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటున్న వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
భారత సంస్కృతి, సంప్రదాయాలే కాదు.. వంటకాలూ ఎంతో ప్రత్యేకం. ప్రపంచ ప్రముఖులు సైతం భారతీయ వంటకాలకు ఫిదా అవుతుంటారు. తాజాగా న్యూయార్క్ నగరంలో ఓ పసిపాప భారతీయ ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటున్న వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా చిన్న పిల్లలు అన్నం తినేందుకు మారాం చేస్తుంటారు. తల్లులు గంటల తరబడి వారి వెంటపడి బలవంతంగా తినిపిస్తే కానీ తినరు. అది కూడా నోటికి రుచిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే, ఈ పాప మాత్రం భారతీయ వంటకాలను ఒకదాని తర్వాత ఒకటి ఎంతో ఇష్టంగా లాగించేసింది. న్యూయార్క్ నగరంలోని ఇండియన్ రెస్టారెంట్‌లో తన కుమార్తె సోఫియా భారతీయ ఆహారాన్ని ఎంజాయ్ చేస్తున్న వీడియోను తల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. రెండు విభాగాలుగా ఈ వీడియోను ఆమె షేర్ చేసింది. పార్ట్-1 వీడియోలో ఆ చిన్నారి ముందుగా పాపడ్ ట్రై చేస్తుంది. ఆ తర్వాత ఇండియన్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీ తినేందుకు ట్రై చేయగా.. అది కిందపడిపోతుంది. అనంతరం గోబీ, దాల్, నాన్‌ని ఎంతో ఇష్టంగా తింటుంది. ఇక పార్ట్-2 వీడియోలో దాల్ తడ్కా, నాన్, రైస్ వంటి భారతీయ రుచుల్ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతరించిపోతున్న అరుదైన జంతువు..
నీళ్లలో పడి మునిగిపోతున్న కాకి.. అక్కడే ఉన్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

