Chandrayaan-3: చంద్రయాన్-3.. 40 రోజుల సమయం ఎందుకు పడుతుందో తెలుసా..? ఇస్రో స్పెషాలిటీ ఇదే..
Chandrayaan-3 Mission 2023: జాబిలిని అందుకోవాలనేది భారత్‌కి దశాబ్దాల నాటి కల. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తోంది ఇస్రో. చంద్రయాన్ 1తో నీటి జాడలు గుర్తించింది. చంద్రయాన్ 2ని ప్రయోగించి..

Chandrayaan-3 Mission 2023: జాబిలిని అందుకోవాలనేది భారత్‌కి దశాబ్దాల నాటి కల. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తోంది ఇస్రో. చంద్రయాన్ 1తో నీటి జాడలు గుర్తించింది. చంద్రయాన్ 2ని ప్రయోగించి.. చివరి నిముషంలో ఫెయిల్ అయింది. దాదాపుగా సక్సెస్ అయిందనుకున్న సమయంలో టెక్నికల్ సమస్య రావడం.. క్రాష్ ల్యాండింగ్ కావడంతో చంద్రుడి జాడను పట్టుకోలేకపోయాం. కానీ.. నాసా ఎప్పుడో చంద్రుడి అడుగు జాడలను కనిపెట్టింది. 1969లోనే జాబిల్లిపైకి వ్యోమగాములను పంపింది. వాళ్లను తిరిగి సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చింది. ఇదంతా 8 రోజుల్లోనే పూర్తైంది. కానీ మనం కనీసం రోవర్‌ని కూడా ఎందుకు పంపలేకపోతున్నాం.
చంద్రుడిపై అన్వేషణలో భాగంగా భారత్ చేపట్టిన మిషన్లు ఎన్ని రోజులు పట్టాయో ఇప్పుడు చూద్దాం.
చంద్రయాన్-1..
- ఆగస్ట్ 28, 2008న రాకెట్ ప్రయోగం
- నవంబర్ 12, 2008న చంద్రుడి కక్ష్యలోకి ఆర్బిటర్
- 77 రోజుల సమయం
చంద్రయాన్-2
- జులై 22, 2019న రాకెట్ ప్రయోగం
- సెప్టెంబర్ 6, 2019న క్రాష్ ల్యాండింగ్
- 48 రోజుల సమయం
చంద్రయాన్-3
- జులై 14న 2.35PM ప్రయోగించనున్న నాసా
- ఆగస్ట్ 23 లేదా 24న ల్యాండ్ అయ్యే అవకాశం
- 40 రోజులు పడుతుందని అంచనా..
1969 జులై 16న… అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి శాటరన్ రాకెట్ సాయంతో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖెల్ కొల్లిన్స్ అనే ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపింది నాసా. జులై 16 ఉదయం 8 గంటల 32 నిముషాలకు నింగిలోకి దూసుకెళ్లిన.. అపోలో 11 వ్యోమనౌక 102 గంటల 45 నిముషాల తర్వాత అంటే జులై 20న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. అంటే కేవలం 4 రోజుల 6 గంటల్లోనే వాళ్లు చంద్రుడిపైకి చేరుకున్నారు. చంద్రుడిపై వ్యోమగాములు ల్యాండ్ అయిన ఆ వీడియోను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. జాబిల్లిపై తొలి అడుగు.. మానవ జాతికి అతిపెద్ద అడుగు అంటూ నాసా అప్పట్లో ట్వీట్ చేసింది.




చంద్రమండలంపై వాళ్లు దాదాపు 21 గంటలు గడిపారు. ఆ తర్వాత 21 కిలోల మేర అక్కడ ఉన్న మట్టిని, ఖనిజాలను తీసుకుని తిరిగి.. జులై 24న నార్త్ ఫసిఫిక్ సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ పరిశోధనలకు కేవలం ఎనిమిది రోజుల 3 గంటలు సమయం మాత్రమే పట్టినట్లు అధికారులు తెలిపారు.
కానీ, ఇస్రో ప్రయోగం.. చంద్రయాన్-3 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడానికి 40 రోజులు పడుతోందని పేర్కొంటున్నారు. 50 ఏళ్ల కిందట చేసిన ప్రయోగంలో.. వేగంగా చేరుకోగలిగినప్పుడు.. ఇప్పుడు మరింత వేగంగా జరిగాలి.. కానీ, ఎందుకు ఆలస్యంగా వెళ్తోంది?
NASA ..
- మిషన్ అపోలో 11
- సాటర్న్ V SA-506 రాకెట్
- ఎత్తు – 110.2 మీటర్లు
- వెహికల్ డయామీటర్ – 10.1 మీటర్లు
- భారీ పేలోడ్ బరువు – 49, 735 కిలోలు
- రాకెట్ బరువు – 2800 టన్నులు
- ల్యాండ్ అయినపుడు బరువు – 45 టన్నులు
- మనుషులతో కూడిన మిషన్
ISRO
- మిషన్ చంద్రయాన్ 2
- GSLV-Mk III – M1 రాకెట్
- ఎత్తు – 43.43 మీటర్లు
- వెహికల్ డయామీటర్ – 4 మీటర్లు
- భారీ పేలోడ్ బరువు – 3,136 కిలోలు
- రాకెట్ బరువు – 640 టన్నులు
- ల్యాండ్ అయినపుడు బరువు – 4 టన్నులు
- మానవరహిత మిషన్
నాసా దగ్గర ఉన్న టెక్నాలజీతో పోల్చుకుంటే.. మన టెక్నాలజీ చాలా తక్కువ.. కానీ మన సైంటిస్టుల నైపుణ్యం ప్రపంచం గర్వించదగినది.. ఎందుకంటే.. అతి తక్కువ ఇంధనంతో, భూమి గురుత్వాకర్షణ శక్తిని కూడా ఉపయోగించుకుని చంద్రుడిని చేరుకోడానికి ఇస్రో ప్రయత్నిస్తోంది.. దీంతో సమయం ఎక్కువగా పడుతోందని పేర్కొంటున్నారు శాస్త్రవేత్తలు..
ఈ విధానంలో రాకెట్ నేరుగా చంద్రుడి మీదకు దూసుకెళ్లడానికి బదులుగా.. భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ, క్రమంగా తన అపోజీని పెంచుకుంటూ వెళ్లేలా ఏర్పాటు చేశారు. అది కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంలోకి రోవర్‌ని పంపుతోంది ఇస్రో.
మరిన్ని జాతీయ వార్తల కోసం..