పిల్లలను వదలేసి ప్రియుడితో పారిపోయిన భార్య.. కట్ చేస్తే.. భర్త చేసిన పనితో..
భార్య మోసం తట్టుకోలేక ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన న్యాయవాది కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు చిన్న పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య, ఆస్తి కోసం డిమాండ్ చేస్తూ, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించింది. ప్రియుడు కూడా చంపేస్తానని బెదిరించడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన భర్త ఏం చేశాడంటే..?

ఈ ఆధునిక యుగంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. భార్యల చేతుల్లో ఇప్పటికే ఎంతోమంది భర్తలు బలయ్యారు. ప్రియుడి కోసం పిల్లలను సైతం చంపేసిన ఘటనలు లేకపోలేదు. తాజాగా భార్య మోసాన్ని తట్టుకోలేక ఓ న్యాయవాది ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది. కమల్ కుమార్ సాగర్ అనే న్యాయవాది 2017లో కోమల్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదున్నర, మూడున్నర సంవత్సరాల వయస్సు గల ఇద్దరు చిన్న కొడుకులు ఉన్నారు. సుమారు ఆరు నెలల క్రితం, కమల్‌కు తన భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన విశాల్ అనే యువకుడితో ఆమెకు స్నేహం మొదలై.. అది ప్రేమగా మారింది. మూడు నెలల క్రితం కోమల్ తన ఇద్దరు పిల్లలను వదిలి.. ప్రియుడు విశాల్‌తో పారిపోయి అతనితోనే ఉంటుంది.
సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
భార్య చేసిన పనితో డిప్రెషన్‌లోకి వెళ్లిన కమల్‌ను.. ఆమె ప్రియుడు విశాల్ చంపేస్తానని బెదిరించేవాడు. అంతేకాకుండా తన భార్య కోమల్ తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తూ, విడాకులకు సిద్ధమైంది. ఆస్తి అమ్మి డబ్బు ఇవ్వాలని, పిల్లలను కూడా తీసుకెళ్తానని మూడు రోజుల క్రితం ఫోన్ చేసి డిమాండ్ చేసింది. ఒత్తిడిని తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాశారు. అందులో ‘‘నేను ఇక బ్రతకలేను. నా భార్య, పిల్లలను వదిలి తన లవర్‌తో వెళ్లిపోయింది. ఆమె మూడు నెలలుగా అతనితోనే ఉంటుంది. నన్ను తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తుంది. నా వల్ల కావడం లేదు. అందుకే నా జీవితానికి ఎండ్ కార్డ్ వేసుకుంటున్నాను. నా మరణం తరువాత, నా పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ వారి తల్లి వద్దకు వెళ్లనివ్వకండి’’ అని రాశాడు.
న్యాయవాది అయి ఉండి.. రోజూ ఇలాంటి కేసులు చూసే కమల్‌కు తనకే ఈ గతి పడుతుందని ఊహించలేదని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. కమల్ తండ్రి రాజేంద్ర మాట్లాడుతూ.. కోమల్ విడాకులు కావాలని అడిగిందని, విశాల్ తన కొడుకును చంపేస్తానని బెదిరించాడని తెలిపారు. భార్య పనితో సమాజంలో ముఖం చూపించలేక పోతున్నానని కమల్ ఆవేదన చెందాడని అతని అత్త ఉష తెలిపారు. కోమల్ తండ్రి సైతం.. కూతురు చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకించాడు.పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




