AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకు ధన్యవాదాలు తెల్పిన పాక్ శరణార్ధులు

పౌరసత్వ సవరణ చట్టం మైనార్టీలకు వ్యతిరేకం కాదన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని ఉపసంహరించే ప్రసక్తే లేదన్నారు. జోధ్ పూర్ లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దమ్ముంటే చర్చించేందుకు ముందుకు రావాలన్నారు. ఒకవేళ వారికి దమ్ము లేకపోతే.. ఇటాలియన్ భాషలోకి అనువదించి ఇస్తామంటూ సోనియా గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మైనార్టీలు, […]

షాకు ధన్యవాదాలు తెల్పిన పాక్ శరణార్ధులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 04, 2020 | 4:25 AM

Share

పౌరసత్వ సవరణ చట్టం మైనార్టీలకు వ్యతిరేకం కాదన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని ఉపసంహరించే ప్రసక్తే లేదన్నారు. జోధ్ పూర్ లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దమ్ముంటే చర్చించేందుకు ముందుకు రావాలన్నారు. ఒకవేళ వారికి దమ్ము లేకపోతే.. ఇటాలియన్ భాషలోకి అనువదించి ఇస్తామంటూ సోనియా గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మైనార్టీలు, యువతకు చేరువ కావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని అమిత్‌ షా అన్నారు.

కాగా, పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులు శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. ఈ చట్టం ప్రకారం.. ఆఫ్ఘన్, పాక్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన వేధింపులు, హింసాత్మక సంఘటనల కారణంగా, ఆ దేశాల్లోని మైనారిటీలైన హిందువులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, జైనులు, క్రైస్తవులు.. 2014 డిసెంబరు 31న లేదా అంతకుముందు భారత దేశంలో ప్రవేశించినట్లయితే, వారికి భారత దేశ పౌరసత్వం ఇవ్వవచ్చు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు