ఇమ్రాన్ వక్రబుద్ది.. ఢాకాలో జరిగితే యూపీలో అంటూ.. చివరకు..
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన వక్రబుద్దిని మరోసారి ప్రదర్శించారు. భారత్‌పై తన ద్వేశాన్ని వెల్లగక్కే ప్రయత్నంలో.. ఓ తప్పుడు పోస్ట్ పెట్టి నెట్టింట్లో నవ్వులపాలయ్యారు. ప్రపంచం ముందు భారత్‌ను ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం భారత్‌లో జరగుతున్న పౌరసత్వ సవరణ చట్టాన్ని.. అక్కడి పోలీసులు ఎలా అణగదొక్కుతున్నారో చూడండి అంటూ ఆ పోస్టుకు కామెంట్ పెట్టారు. ఆందోళనకారులను పోలీసులు ఎంత దారుణంగా హింసిస్తున్నారో చూడండి మూడు వీడియోలు […]
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన వక్రబుద్దిని మరోసారి ప్రదర్శించారు. భారత్‌పై తన ద్వేశాన్ని వెల్లగక్కే ప్రయత్నంలో.. ఓ తప్పుడు పోస్ట్ పెట్టి నెట్టింట్లో నవ్వులపాలయ్యారు. ప్రపంచం ముందు భారత్‌ను ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం భారత్‌లో జరగుతున్న పౌరసత్వ సవరణ చట్టాన్ని.. అక్కడి పోలీసులు ఎలా అణగదొక్కుతున్నారో చూడండి అంటూ ఆ పోస్టుకు కామెంట్ పెట్టారు. ఆందోళనకారులను పోలీసులు ఎంత దారుణంగా హింసిస్తున్నారో చూడండి మూడు వీడియోలు కూడా పెట్టాడు. ఇదంతా భారత్‌లోని యూపీలో జరుగుతున్న సంఘటనలు అంటూ పేర్కొన్నాడు.
ఈ వీడియోల్లో ముస్లింలను పోలీసులు చితకబాదుతున్న దృశ్యాలు ఉన్నాయి. అయితే వాస్తవానికి ఈ వీడియోలు ఇండియాకు సంబంధించినవి కావు. అవన్నీ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందినవి. అవి కూడా 2013 మే నెలలో ఢాకాలో.. ఆందోళనకారులపై బంగ్లాదేశ్‌కు చెందిన ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ లాఠీఛార్జ్ చేసినవి. అయితే వీటిని నిర్ధారించుకోకుండానే ఇమ్రాన్ ఖాన్.. యూపీకి చెందినవంటూ పోస్ట్ చేశారు. అయితే వీడియోలు పెట్టిన కొద్ది గంటలకు కానీ తాను చేసిన పొరపాటు ఏమిటో ఇమ్రాన్‌కు తెలియలేదు. ఇంతలోగా నెటిజన్లు ఇమ్రాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. ఓ ఆట ఆడుకున్నారు. చివరకు ఇమ్రాన్ ఖాన్ తాను చేసిన ఆ ట్వీట్‌తో పాటు జత చేసిన ఫేక్ వీడియోలను కూడా డిలీట్ చేశారు.
Prime Minister of Pakistan Imran Khan tweets an old video of violence from Bangladesh and says, ‘Indian police’s pogrom against Muslims in UP.’ pic.twitter.com/6SrRQvm0H9
— ANI (@ANI) January 3, 2020